RRR : Behind and Beyond : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) కలిసి నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జక్కన్న (SS Rajamouli) తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మూవీ మొదలైనప్పటి నుంచి, ఆస్కార్ అవార్డును అందుకునే వరకు సినిమా జర్నీని, బీటిఎస్ సీన్లతో ఓ డాక్యుమెంటరీగా తీర్చిదిద్ది, దాన్ని తెరపైకి తీసుకొచ్చారు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ (RRR : Behind and Beyond) అనే టైటిల్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో సినిమా గురించి చిత్ర బృందం పడిన కష్టాన్ని చూపించారు.
తాజాగా సోషల్ మీడియాలో దానికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి. భీమ్ బ్రిటిష్ సైన్యానికి పట్టుబడిన తర్వాత, అతన్ని కట్టేసి, కొరడాలతో రామరాజు తోనే కొట్టించే సీన్ సినిమాలో కన్నీరు పెట్టిస్తుంది. ఈ ఎమోషనల్ సీన్ ను ఎలా తీసారో తెలిస్తే నిజంగానే ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఆ సీన్ కోసం నిజంగానే తారక్ కొరడాతో తన్నులు తిన్నాడు. రామ్ చరణ్ కొరడాతో నిజంగానే తారక్ ను కొట్టాడు. కానీ అంతలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దెబ్బ తగిలిందా అంటూ తారక్ ను హగ్ చేసుకోవడం, చిత్ర బృందం అందరూ టెన్షన్ తో తారక్ దగ్గరికి రావడం ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఎమోషనల్ అవుతూ కన్పించారు. దీంతో చెర్రీ మనసు బంగారంరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమనులు. ఇక దీన్ని చూశాక సినిమా కోసం నిజంగానే ఇంత కష్టపడ్డారా అంటూ షాక్ అవుతున్నారు నెటిజెన్లు.
Korada NTR Ki Gettiga Tagilindemo Ani Charan Vachi NTR Ni 🫂 Chesukovadam 🥺🥺❤️❤️.#RRRBehindAndBeyond #RRRMovie pic.twitter.com/VRUyXXzYQE
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) December 27, 2024
ఇదిలా ఉండగా ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ (RRR : Behind and Beyond) డాక్యుమెంటరీని ముందుగా ప్రకటించినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తారని అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం డైరెక్ట్ గా థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లారు. 1 గంట 35 నిమిషాల రన్ టైంతో ఉన్న ఈ డాక్యుమెంటరీని డిసెంబర్ 20న కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ థియేటర్లలో సినిమాకు సంబంధించిన బిటిఎస్ సీన్లను చూడడానికి జనాలు ఇష్టపడట్లేదు అన్న విషయాన్ని త్వరగానే గ్రహించింది ‘ఆర్ఆర్ఆర్’ టీం.
వెంటనే ఈ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ (Netflix) లో రిలీజ్ చేసింది. ఈరోజు నుంచి ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ (RRR : Behind and Beyond) డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీలో సినిమాకు సంబంధించిన బిటిఎస్ సీన్లు మాత్రమే కాకుండా డైరెక్టర్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రమా రాజమౌళి, కీరవాణి తదితరులు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ దక్కని ఈ డాక్యుమెంటరీకి నెట్ ఫ్లిక్స్ లో ఆదరణ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఇప్పటికైతే ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.