BigTV English

New Year Scams : న్యూ ఇయర్ స్కామ్ సీజన్​ – ఈ 5 పాటిస్తే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు!

New Year Scams : న్యూ ఇయర్ స్కామ్ సీజన్​ – ఈ 5 పాటిస్తే మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు!

New Year Scams : ప్రస్తుతం ఆన్​లైన్ ఈ కామర్స్ ప్లాట్​ఫామ్స్​ లో​ క్రిస్మస్​, న్యూ ఇయర్ సేల్స్ (New Year sales) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫెస్టివల్, హాలీడే సీజన్… స్కామ్ సీజన్​గా కూడా మారిపోయింది. ఈ పండగ సేల్స్​ను అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వల వేసి బురిడి కొట్టిస్తున్నారు. వాళ్ల డబ్బులను కాజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అటువంటి స్కామ్స్ బారిన పడకుండా ఉండేందుకు, హాలీడే సీజన్ ​లో స్కామ్ ట్రాప్ ​కు గురి కాకుండా ఉండేందుకు.. 5 సేఫ్టీ టిప్స్​ ను మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఆకర్షణకు గురి కావొద్దు – ఈ ఫెస్టివల్ సీజన్​లో స్కామర్స్​.. ట్రావెల్, గ్యాడ్జెట్స్, ఫ్యాషన్​ పై అదిరిపోయే ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను బుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఇలాంటి డిస్కౌంట్లకు అట్రాక్ట్​ అవ్వకుండా, ముందుగా అవి నమ్మదగినవా లేదా నకిలీవా అనేవి తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. దాని రివ్యూస్ చూడాలి. వెరీఫైడ్, అథెంటిక్ వైబ్​సైట్స్​లోకి వెళ్లి ఆ ఆఫర్ల గురించి చెక్ చేసుకోవాలి. అప్పుడే కొనుగోలు చేయాలి.

లింక్స్​ను నమ్మొద్దు – స్కామర్స్.. ఈ మెయిల్స్​, టెక్ట్స్​ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ ద్వారా నకిలీ లింక్స్​ను సెండ్ చేస్తుంటారు. వాటిపై మనం క్లిక్ చేయగానే, మన దగ్గరన్న వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేస్తుంటారు. కాబట్టి ఎటువంటి లింక్​ వచ్చినా, పైగా అది మీ ఫ్రెండ్ నెంబర్ నుంచి వచ్చినా, అస్సలు వాటిపై క్లిక్ చేసి మోసపొవద్దు. వెరీఫై చేసుకున్నాకే ముందడుగు వెయ్యాలి.


మరింత పటిష్టంగా సెక్యూరిటీ ఫీచర్ – ఇలాంటి స్కామ్స్​ నుంచి తప్పించుకోవాలంటే, మీ డివైసెస్​లో సెక్యూరిటీ ఫీచర్స్​ పటిష్టతను మరింత పెంచుకోవాలి. అన్ని కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్త చర్యలు పాటించాలి. కాబట్టి మీ అకౌంట్స్​లో టూ ఫ్యాక్టర్​ అథెన్​టిసియేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోవాలి. అలానే మీ సెన్సిటివ్ ఇన్​ఫర్మేషన్​ను అనవసరపు, అన్​వెరీఫైడ్​ వెబ్​సైట్స్​లో నమోదు చేయకూడదు.

ఫేక్ బ్యాంక్ కాల్స్​ – కొంతమంది స్కామర్స్ అయితే బ్యాంక్​కు సంభంధించిన అధికారులలాగా మాట్లాడి బురిడి కొట్టిస్తుంటారు. ఏఐ ఫోన్​ నెంబర్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా ఒరిజినల్ బ్యాంక్​కు సంబంధించిన అధికారులు లాగా మాట్లాడి వ్యక్తిగత సమాచారం, పిన్​, ఓటీపీ నెంబర్​లు అడిగి మనల్ని ట్రాప్ చేస్తుంటారు. ఒరిజినల్ బ్యాంక్స్​ ఎప్పుడూ కూడా మీ వ్యక్తిగత సమాచారాన్ని అడగవు. కాబట్టి అలాంటి కాల్స్​ లేదా ఇతర లింక్స్​, ఈ మెయిల్స్ వస్తే వాటిని తక్షణమే డిస్​కనెక్ట్ చేయండి.

ర్యాండమ్ గివ్​అవేస్​లో నో పార్టిసిపేట్​ – స్కామర్స్​.. ఫేక్ గివ్​అవేస్​ ద్వారా కూడా వినియోగదారులను ట్రాప్ చేసి మోసం చేస్తుంటారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తుంటారు. కాబట్టి ఇటువంటి కంటెస్ట్​లో అస్సలు పాల్గొనకూడదు. వారు అడిగిన సెన్సిటివ్ డీటెయిల్స్​ను ఇవ్వొద్దు. ఎందుకంటే స్కామర్స్ ఈ సెన్సిటివ్ డీటెయిల్స్​ను సేకరించి, డార్క్​ వెబ్​కు అమ్మేస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ALSO READ : స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ఉపయోగించబోతున్న ఇస్రో.. అంతరిక్షంలో జాయింట్ శాటిలైట్లు

Related News

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Big Stories

×