Mercury Venus Conjunction: గ్రహాల రాకుమారుడైన బుధుడు జూలై 16న సింహ రాశిలోకి ప్రవేశించాడు. వచ్చే నెల 22వ తేదీ వరకు బుధుడు అదే రాశిలో సంచరిస్తాడు. అయితే జులై 31న శుక్రుడు తన దిశను మార్చుకుని సింహ రాశిలోకి ప్రవేశించి ఆగస్టు 25 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో జులై 31 వ తేదీన సింహం రాశిలో బుధుడు, శుక్రుడి కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.
బుధుడు, శుక్రుడి కలయిక కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తుంది. సింహరాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. బుధ, శుక్రుల కలయిక వల్ల ఏ రాశుల వారి అదృష్టం మారి, వారు అనుకున్నవన్నీ జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి:
బుధ, శుక్రుల కలయిక వల్ల మీ కుటుంబ సంబంధాలు బాగా పెరుగుతాయి. చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న వారు తమకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశముంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారస్థులు పాత సమస్యల నుంచి సమర్థవంతమైన మార్గాన్ని కనుగొంటారు. మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది. విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
మీన రాశి:
గత కొన్నిరోజులుగా మీ ఆరోగ్యం బాగా లేకపోతే చింతించకండి. రాబోయే రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. దాని కారణంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు పనికి సంబంధించి లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన కూడా వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మీ జీతం కూడా పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంది.
తులా రాశి:
వ్యాపారస్తులు రాబోయే రోజుల్లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. దీర్ఘ కాలంగా ఉన్న రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. వ్యాపారస్థులు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సంతానం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
మేష రాశి:
మీరు అన్ని రంగాల్లో విజయం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో జీవితంలో ప్రతి పనిలో అదృష్టం మీకు కలిసి వస్తుంది. నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభం అవుతాయి. వివాహితులు తమ కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. వాహనాలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి చేసుకుంటారు.
Also Read: ఈ వారమంతా శుక్రుని సంచారంతో ఈ రాశులకు అడుగడుగునా అదృష్టమే..
మిథున రాశి:
లక్ష్మీనారాయణ యోగం వల్ల మిథున రాశివారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి రంగంలో విజయం, సంతోషకరమైన కుటుంబం, వైవాహిక జీవితం వీరికి లభిస్తుంది. కార్యాలయంలో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ ఆఫీసుల్లో పదోన్నతులతో పాటు జీతం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది. భవిష్యత్తు కోసం అనేక ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.