Ayyappa Swamy Prasadam: అయ్యప్ప స్వామి అంటే భక్తి, నియమం, పవిత్రతకు ప్రతీక. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు సబ్బరిమల యాత్రలో స్వామి దర్శనం చేసుకుని ఆ పవిత్రమైన అరవణ పాయసం ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇది కేవలం తీపి వంటకం కాదు, దేవునికి అర్పించే నైవేద్యం. ఆ ఒక్క చుక్కలోనూ దాగి ఉంటుంది భక్తి, ఆనందం, దివ్యమైన రుచి. ఇప్పుడు ఆ ఆలయ ప్రసాదాన్ని మనం ఇంట్లోనే భక్తితో ఎలా సిద్ధం చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఇంట్లోనే అరవణ పాయసం తయారీ విధానం
అయ్యప్ప స్వామి అంటే భక్తి, నియమం, విశ్వాసం కలయిక. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సబ్బరిమల యాత్రకు వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. ఆ యాత్రలో పవిత్రమైన ప్రసాదం అరవణ పాయసం ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది కేవలం ఒక తీపి వంటకం కాదు, భక్తుల ప్రేమ, ఆరాధన, పవిత్రతకు ప్రతీక. ఇప్పుడు అదే దివ్య రుచిని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.
ఒక బౌల్‌లో రైడ్ రైస్
ముందుగా ఒక బౌల్ రెడ్ రైస్ (ఎర్ర బియ్యం) తీసుకోండి. ఈ రైస్ ఏ సూపర్ మార్కెట్‌లోనైనా లేదా ఆన్లైన్‌లో సులభంగా దొరుకుతుంది. బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టండి. ఈ రైస్‌ను నానబెట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద పాన్ పెట్టి, అందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. ఆ నేతిలో కడిగి పెట్టుకున్న రెడ్ రైస్ వేసి మీడియం ఫ్లేమ్‌లో ఐదు నిమిషాల పాటు వేయించండి. దోరగా వాసన వచ్చేంత వరకు వేయించండి. తర్వాత మనం ఏ బౌల్‌తో రైస్ తీసుకున్నామో అదే బౌల్‌తో మూడు బౌల్స్ నీళ్లు పోసి కలపండి. ఇదే ప్రక్రియను ప్రెషర్ కుక్కర్‌లో చేస్తే త్వరగా ఉడికుతుంది, కానీ ట్రెడిషనల్ పద్ధతిలో వండితే రుచి మరింత బాగుంటుంది. మధ్యమధ్యలో కలుపుకుంటూ రైస్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచండి.
Also Read: Smart Watch At Rs 999: రూ.15వేల స్మార్ట్ వాచ్ ఇప్పుడు కేవలం రూ.999కే.. అమెజాన్‌లో మళ్లీ షాక్ ఆఫర్
తాటి బెల్లం తప్పనిసరి
ఇప్పటికే రైస్ ఉడుకుతుండగా బెల్లం పాకం సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రసాదానికి తప్పనిసరిగా తాటి బెల్లం వాడాలి. అదే అయ్యప్ప స్వామి ప్రసాదానికి అసలైన రుచి ఇస్తుంది. బెల్లాన్ని సన్నగా తురిమి, ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ ఉండండి. బెల్లం కరిగాక దానిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టండి.
మంటను మీడియంలో ఫ్లేమ్
ఇప్పుడు ఉడికిన రైస్‌లోకి ఆ బెల్లం నీటిని ఫిల్టర్ చేసి కలపండి. బెల్లం నీరు వేసిన తర్వాత మిశ్రమం కాస్త పల్చన అవుతుంది. మంటను మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచి అడుగుపట్టకుండా గరిటతో కలుపుతూ చిక్కబడే వరకు ఉడికించాలి. దగ్గరపడేటప్పుడే రెండు టేబుల్ స్పూన్ల చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే రెండు టేబుల్ స్పూన్ల నల్ల ఎండు ద్రాక్ష వేసి కలపండి. వీటిని నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు పాకంలోనే ఉడికితే అద్భుతమైన రుచి వస్తుంది.
ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేయాలి
ఉడికించే సమయంలో మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ కలపండి. మొత్తం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి చాలు. మీరు ఆవు నెయ్యి వాడితే రుచి మరింత భక్తి వాసనతో నిండిపోతుంది. సుమారు ఇరవై నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌లో ఉంచితే పాయసం చిక్కబడుతుంది. ఈ సమయంలో ఒక టీ స్పూన్ సొంటి పొడి, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలపండి. మళ్లీ పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి.
చిక్కటి తీగలా
చివరగా పాకం కరెక్ట్‌గా వచ్చిందా అని తెలుసుకోవాలంటే చేతి వేళ్ల మధ్య పెట్టి లాగితే చిక్కటి తీగలా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి. అయ్యప్ప స్వామికి నైవేద్యంగా సమర్పించండి లేదా కుటుంబంతో కలిసి భక్తి భావంతో స్వీకరించండి. ఈ అరవణ పాయసం ఉడికేటప్పుడే వచ్చే ఆ తియ్యని వాసన, ఆ దివ్యమైన రుచి ఒకసారి మనసులోకి చేరితే ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ పాయసాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. కార్తీక మాసంలో సబ్బరిమల యాత్రకు ఎవరు వెళ్తారు, ఎవరు ప్రసాదం తెస్తారు అని ఎదురు చూడకుండా, మీ చేతులతో, మీ భక్తితో ఇంట్లోనే పవిత్రమైన అరవణ పాయసం తయారు చేసుకోండి.