BigTV English
Advertisement

God Photos: మీ మొబైల్ స్క్రీన్ పై దేవుని ఫోటోలు పెట్టవచ్చా? ఎలాంటివి పెట్టకూడదు?

God Photos: మీ మొబైల్ స్క్రీన్ పై దేవుని ఫోటోలు పెట్టవచ్చా? ఎలాంటివి పెట్టకూడదు?

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో కచ్చితంగా కనిపించేది మొబైల్. మొబైల్ లో ఫోన్లలో దేవతల చిత్రాలను వాల్ పేపర్ గా పెట్టుకునే అలవాటు ఎంతో మందికి ఉంది. అయితే వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం మురికి చేతులతో దేవుని ఫోటోలు పెట్టిన మొబైల్‌ను ముట్టకూడదని అంటారు. అలాగే ఒక్కోసారి ప్రైవేటు పార్టులపై చేయి పెట్టాక మళ్ళీ మొబైల్ ఫోన్లను ముట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం దేవుడిని అగౌరవపరచడమేనని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల గ్రహ ప్రభావాలు ప్రతికూలంగా మారుతాయి అని అంటోంది. ఇలా చేస్తే అడ్డంకులు, మానసిక అశాంతి వంటి ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉందని వివరిస్తోంది. ప్రార్థనా స్థలంలో మాత్రమే దేవుని ఫోటోలు పెట్టుకోవాలి. అప్పుడే వారి గౌరవాన్ని కాపాడినట్టు అవుతుంది.


వీటిని పెట్టకండి
మొబైల్ స్క్రీన్ పై వాల్ పేపర్‌గా గుడి, మసీదు, చర్చి వంటి మతపరమైన ప్రదేశాల ఫోటోలను కూడా ఉపయోగించకూడదు. వాటిని కూడా మురికి చేతులతో పదే పదే తాకే అవకాశం ఉంటుంది. అలా అయితే మతపరమైన ప్రదేశాలను కించపరిచినట్టే అవుతుంది. ఇది మీలో మానసిక అశాంతికి కారణం అవుతుంది. జీవితంలో అడ్డంకులను కూడా పెంచుతుంది.

విచారం ఉన్న ఫోటోలు
ఇక మొబైల్ ఫోన్ పై వాల్ పేపర్ గా విచారంగా ఉన్న మనుషుల ఫోటోలు, నిరాశతో నిండిన ఫోటోలు, కోపంగా ఉన్న వ్యక్తుల ఫోటోలు పెట్టుకోకూడదు. ఇవి మీలో ప్రతికూల భావోద్వేగాలను పెంచేస్తాయి. మీలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తాయి. మిమ్మల్ని మానసికంగా బలహీన పరుస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం భావోద్వేగ వాల్ పేపర్లు మానసిక స్థితిని సవ్యంగా ఉండనివ్వవు. జీవితంలో సమస్యలను పెంచుతాయి. భవిష్యత్తుకు అడ్డంకులుగా మారుతాయి.


ఈ రంగులు ఉంటే మంచిది
మొబైల్ స్క్రీన్ పై పెట్టే వాల్ పేపర్లలో నలుపు, ముదురుగా ఉండే నీలం, గోధుమ రంగు, ఊదా రంగు వంటివి లేకుండా చూసుకోండి. ఇవి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఈ రంగులు శని, రాహువు ప్రభావాన్ని మీపై పెంచేస్తాయి. దీనివల్ల అడ్డంకులు, ఒత్తిడి, ఓటములు అధికమైపోతాయి. కాబట్టి తెలుపు, ఆకుపచ్చ, పసుపు, గులాబీ వంటి లేత రంగులు మీ మొబైల్ వాల్ పేపర్ పై ఉండేలా చూసుకోండి. ఇవి మీలో శాంతిని, ఉత్సాహాన్ని, సానుకూలతను పెంచుతాయి.

జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న ప్రకారం మీ మొబైల్ వాల్ పేపర్‌గా సూర్యోదయాలు, ప్రవహించే జలపాతాలు, పువ్వులు, స్ఫూర్తిదాయకమైన మాటలు, పచ్చని చెట్లు వంటివి ఉంటే ఎంతో మంచిది. ఇది సానుకూల శక్తిని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. దీనివల్ల విజయం, శాంతి, శ్రేయస్సు వంటివి దక్కుతాయి. నీలి ఆకాశం, బీచులు, సూర్యకిరణాలు వంటివి పెట్టుకుంటే మనసు ఉత్సాహంగా మారుతుంది. మానసిక బలాన్ని పెంచుతుంది. మీకు విజయాన్ని కూడా అందిస్తుంది.

మొబైల్ వాల్ పేపర్ పైన చెప్పిన ఫోటోలను పెట్టుకుని చూడండి.. మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు కలుగుతాయి. అంతా మంచే జరుగుతుంది.

Related News

Good Luck: మీకు అదృష్టం కలిసొచ్చే ముందు కనిపించే నాలుగు శుభ సంకేతాలు ఇవే

Ayyappa Swamy Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం.. ఇంట్లోనే అరవణ పాయసం ఇలా తయారు చేయండి

Karthika Masam 2025: కార్తీక సోమవారం సాయంత్రం ఇలా పూజ చేస్తే.. విద్య, ఉద్యోగాల్లో తిరుగుండదు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో రుబ్బురోలుకు పూజ ఎందుకు చేస్తారు? దాని వెనుక ఉన్న నిజమైన ఆధ్యాత్మిక రహస్యం

Mysterious Temple: ప్రశ్న అడిగితే సమాధానం చెప్పే హనుమంతుడు.. చమత్కారేశ్వర్ ఆలయం అద్భుత రహస్యం

Karthika Masam 2025: కార్తీక మాసం తొలి సోమవారం.. ఎలాంటి నియమాలు పాటించాలి ?

Lord Hanuman: హనుమంతుడి నుంచి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలేంటో తెలుసా ?

Big Stories

×