ప్రతి ఒక్కరికీ జీవితంలో మంచి కాలం ఏదో ఒకసారి మొదలవుతుంది. అది జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. మీ జీవితంలో అదృష్టం కలిగేటప్పుడు ప్రకృతి లేదా దేవుడు మీకు ముందుగానే కొన్ని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అవన్నీ కూడా శుభసంకేతాలు గానే ఉంటాయి. వాటి వల్ల మీ ఆలోచనల్లో లేదా ప్రవర్తనలో మార్పు కనిపించవచ్చు. లేదా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా మార్పు కనిపించవచ్చు. మీ జీవితంలో సంతోషమైన కాలం ప్రారంభించేముందు కొన్ని రకాల సంకేతాలు దేవుడు చూపిస్తాడు. ఆ శుభసంకేతాల గురించి ఇక్కడ మేము ఇచ్చాము.
కలలో మంత్రాలు
నిద్రపోయిన తర్వాత అందరికీ కలలు వస్తూ ఉంటాయి. అలా మీకు కలలో ఎప్పుడైనా ఓమ్ అనే శబ్దం కనిపించడం లేదా గాయత్రీ మంత్రాలు వినిపించడం, రామ రామ అని వినిపించడం వంటివి జరిగితే అవి శుభ సంకేతాలుగానే పరిగణించాలి. మీలోని ఆధ్యాత్మిక శక్తి మేలుకొందని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు దక్కుతాయని దీని అర్థం. అలాగే కళల్లో శంఖం, గుడిలో గంట వంటివి కనిపించినా కూడా అదృష్టం మీ జీవితంలో ఎదురవబోతుందని అర్థం చేసుకోవాలి.
బ్రహ్మ ముహూర్తంలో
బ్రహ్మ ముహూర్తంలో లేచే వారి సంఖ్య చాలా తక్కువ. అందరూ పొద్దెక్కిన తర్వాతే నిద్ర లేస్తున్నారు. సూర్యోదయం అయ్యిన తర్వాత లేచే వారి సంఖ్య అధికంగా ఉంది. ప్రతిరోజూ తెల్లవారుజామున మీకు మూడు గంటల నుండి 5 గంటల మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో మీకు పదే పదే మెలకువ వస్తూ ఉంటే అది నిద్ర పట్టక వస్తోందని అనుకోకండి. మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడు ఇలా మెలకువ వస్తుంది. మీ జీవితంలో ఎన్నోసార్లు సానుకూల మార్పులు ప్రారంభమవుతాయని చెప్పడమే దీనికి అర్థం.
శరీరంలో మార్పు
మీ శరీరంలో ఏదైనా మార్పు కనిపిస్తే దాన్ని గమనించండి. జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్న ప్రకారం పురుషులకు కుడి శరీరం భాగం కుచించినట్టు అయితే అది శుభప్రదం అని పరిగణిస్తారు. ఇక మహిళలకు ఎడమ శరీర భాగం కుచించినట్టు అయితే శభ ప్రదమని అంటారు. దీన్ని జీవితంలో శుభవార్తను లేదా విజయాన్ని తీసుకురాబోతోందని అర్థం. నిజానికి కుడి కన్ను అదరడం, ఎడమ కన్ను అదరడం అని వీటి గురించి చెప్పుకుంటారు.
ఇంట్లోని వాతావరణం
మీ జీవితంలో మంచి రోజులు వస్తూ ఉంటే వాటి ప్రభావం మీ ఇంటి వాతావరణంలో కనిపిస్తుంది. మీ ఇంట్లోని మొక్కలు పువ్వులు పూయడం మొదలుపెడతాయి. దీపం ఎక్కువ కాలం వెలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు. ఇవన్నీ కూడా శుభసంకేతాలే. ఆనందం, శ్రేయస్సు అన్నీ మీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాయి చెప్పడమే ఈ సంకేతాల ఉద్దేశం.
పైన చెప్పిన సంకేతాలు మీ జీవితంలో ఎదురైతే మీకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని సూచనగానే భావించాలి. ఆ దేవుడి కరుణ మీపై ఉందని అర్థం చేసుకోవాలి.