BigTV English
Advertisement

Rajamouli: బాహుబలి 3 ప్రకటించేసిన రాజమౌళి.. ఈ అనౌన్స్మెంట్ గెస్ చేయనిది!

Rajamouli: బాహుబలి 3 ప్రకటించేసిన రాజమౌళి.. ఈ అనౌన్స్మెంట్ గెస్ చేయనిది!

Rajamouli:దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli ) తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి.. ప్రపంచస్థాయి గుర్తింపును అందించిన విషయం తెలిసిందే. అలా బాహుబలి 1&2 చిత్రాలతో సరికొత్త సంచలనం సృష్టించిన ఈయన ఈ రెండు చిత్రాలను కలిపి ఇప్పుడు ఒకే సినిమాగా విడుదల చేస్తున్నారు.. ‘బాహుబలి ది ఎపిక్’ టైటిల్ తో అక్టోబర్ 31వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టిన రాజమౌళి.. అందులో భాగంగానే ‘బాహుబలి3’ పై ఆసక్తికర కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.


బాహుబలి 3 పై రాజమౌళి రియాక్షన్..

ఇకపోతే బాహుబలి ఫ్రాంచైజీలో మూడో భాగం కూడా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. దీనికి తోడు ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ క్లైమాక్స్ లో బాహుబలి 3 అనౌన్స్మెంట్ ఉంటుందని టీజర్ కూడా అప్పుడే థియేటర్లలో ప్రదర్శిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్, రానాలతో కలిసి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ.. “అందరూ అనుకుంటున్నట్టు బాహుబలి 3 ఉండదు. కానీ బాహుబలి మూవీ యూనివర్స్ కొనసాగింపు ఉంటుంది. ‘బాహుబలి : ది ఎటర్నల్ వార్’ టీజర్ త్వరలోనే వస్తుంది అయితే ఇదొక యానిమేషన్ ఫిలిం.

ALSO READ:Bigg Boss 9: భరణి – శ్రీజ ఇద్దరు హౌస్‌లోనే.. చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!


ఆయన వల్లే సాధ్యం..

అయితే గతంలో అమెజాన్ వేదికగా 2D యానిమేషన్ రిలీజ్ చేసాము. ఇప్పుడు ‘బాహుబలి:ది ఎటర్నల్ వార్’ 3డీ యానిమేషన్ మూవీలో అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నాము. ఇకపోతే అల్టిమేట్ గా బాహుబలి 3 అనేది ఉంది. కానీ దానికంటే ముందు ఏం చేయాలి అని నిర్మాత శోభు యార్లగడ్డ ఆలోచిస్తుండేవారు. మేము ఏం చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇషాన్ శుక్లా అనే ఒక యానిమేషన్ డైరెక్టర్ వచ్చి బాహుబలి ప్రపంచాన్ని ఎలా విస్తరించవచ్చు? ఏం చేయవచ్చు? అనే ఒక స్టోరీ ఐడియా ఇచ్చారు. ముఖ్యంగా ఆయన చెప్పిన ఐడియా చాలా బాగా నచ్చింది.

120 కోట్లు బడ్జెట్.. టీజర్ అప్పుడే..

రెండున్నర ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్నారు. రూ. 120 కోట్ల బడ్జెట్ తో 3D యానిమేషన్ మూవీ గా చేస్తున్నట్లు శోభు తెలిపారు. పైగా పెద్ద పెద్ద స్టూడియోలు కూడా దీనికోసం పనిచేస్తున్నాయి. అయితే బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ ని బాహుబలి: ది ఎపిక్ ఇంటర్వెల్ లో ప్లే చేస్తాం అంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే బాహుబలి వరల్డ్ లో ఒకదాని తర్వాత మరొకటి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పవచ్చు..

బాహుబలి సినిమా నటీనటులు..

బాహుబలి సినిమా విషయానికి వస్తే… తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపును అందించారు బాహుబలి 1, 2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాలుగా కూడా రికార్డు సృష్టించాయి. ప్రభాస్, రానా ప్రధాన పాత్రలో అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, అడివి శేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related News

Bahubali The Epic: బాహుబలి: ది ఎపిక్.. రివ్యూ పంచుకున్న స్టార్ కిడ్!

Actor Prabhu : నటుడు ప్రభు ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు..

Sankranti -2026: సంక్రాంతి బరి నుంచి యంగ్ హీరో అవుట్… త్యాగం చేస్తున్నాడా?

PVCU MahaKali : ప్రశాంత్ వర్మ మహాకాళి గా బిగ్ బాస్ ఫైనలిస్ట్… భయంకరంగా ఫస్ట్ లుక్..

NC 24 : రికార్డు స్థాయిలో ‘NC24 ‘ ఓవర్సీస్ బిజినెస్.. చైతూ కెరీర్ లో ఇదే హైయెస్ట్..

Mega 158: అంతా ఫేక్ న్యూస్… చిరు మూవీపై మరో న్యూస్

Upcoming Movies Theater: నవంబర్ లో సినిమాల సందడి.. ఆ ఒక్కటిపైనే ఫోకస్..

Big Stories

×