మొంథా తుఫాన్ కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైల్వే సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. భారీ వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లతో పాటు పలు మార్గాల్లో రైల్వే ట్రాక్ ల మీదకి వరద నీరు వచ్చి చేరింది. డోర్నకల్ స్టేషన్ లో వరద నీరు నిలిచిపోవడంతో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్(20833)ను నిలిపివేశారు. ఇతర రైళ్లను ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ స్టేషన్లలో ఆపారు. వరంగల్‌లో దిగాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని కొంతమంది ప్రయాణికులను ఖమ్మం స్టేషన్ నుంచి RTC బస్సుల ద్వారా తరలించారు. డోర్నకల్ లో నీరు తగ్గిన తర్వాత తక్కువ వేగంతో వందేభారత్ రైలును సికింద్రాబాద్ కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ సర్వీస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అటు వర్షాల కారణంగా 11 రైళ్లు రద్దు చేశారు. సుమారు 12 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన రైళ్లలోని ప్రయాణీకులను బస్సుల ద్వారా సమీప ప్రాంతాలకు తరలించినట్లు వివరించారు.
వర్షాల కారణంగా రద్దు చేయబడిన రైళ్లలో 12714- సికింద్రాబాద్-విజయవాడ, 67768- విజయవాడ – డోర్నకల్, 67766- డోర్నకల్ – కాజీపేట, 12748- వికారాబాద్ – గుంటూరు, 07001- చర్లపల్లి – తిరుపతి, 07002- తిరుపతి – చర్లపల్లి, 07251- చర్లపల్లి – తిరుచానూరు, 07252- తిరుచానూరు – చర్లపల్లి, 67215- విజయవాడ – భద్రాచలం, 67216- భద్రాచలం – విజయవాడ, 17034- సిర్పూర్ టౌన్ – భద్రాచలం, 17233- సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, 17234 సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి.
అటు 8189- టాటానగర్ – ఎర్నాకులం, 16031- MGR చెన్నై సెంట్రల్ – SMVD కత్రా, 16318- SMVD కత్రా – కన్యాకుమారి, 20497- రామేశ్వరం – ఫిరోజ్ పూర్, 17406- ఆదిలాబాద్ – తిరుపతి, 12787- నర్సాపూర్ – నాగర్ సోల్, 17205- షిర్డీ సాయినగర్ – కాకినాడ పోర్ట్, 03680- కోయంబత్తూర్ – ధన్ బాద్, 17202- సికింద్రాబాద్-గుంటూరు, 17405- తిరుపతి-ఆదిలాబాద్, 12521- బరౌని-ఎర్నాకులం, 12270- హెచ్. నిజాముద్దీన్ – చెన్నై సెంట్రల్, 12625- తిరువనంతపురం – న్యూఢిల్లీ, 12643- తిరువనంతపురం – హెచ్. నిజాముద్దీన్ రైళ్లలో కొన్ని దారి మళ్లించగా, మరికొన్ని రీషెడ్యూల్ చేశారు.
Read Also: మొంథా ఎఫెక్ట్.. 150కి పైగా రైళ్లు రద్దు, పలు విమాన సర్వీసులు క్యాన్సిల్!
సికింద్రాబాద్ డివిజన్ లోని మహబూబాబాద్-డోర్నకల్-ఖమ్మం సెక్షన్ లో నీరు నిలిచిపోవడం వల్ల, పరిస్థితిని బట్టి రైలు సర్వీసుల రాకపోకలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో అవసరమైతే మాత్రమే ప్రయాణీకులు ప్రయాణాలు చేపట్టాలని సూచించారు. రైళ్ల రద్దు, మళ్లింపులు, రీషెడ్యూల్ చేస్తే, టికెట్ బుకింగ్ సమయంలో అందించిన మొబైల్ నంబర్‌లకు SMS ద్వారా తెలియజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: కమ్మేస్తున్న పొగమంచు, 16 రైళ్లు 3 నెలల పాటు రద్దు!