Australia Cricketer Dies: ఆస్ట్రేలియా క్రికెట్ లో మరో పెను విషాదం నెలకొంది. ఇప్పటికే బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ( Phillip Hughes ) మరణించగా… తాజాగా మరో కుర్ర క్రికెటర్ బంతి తగిలి మరణించాడు. తాజాగా బంతి తగిలి ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ( Ben Austin ) మరణించాడు. 17 ఏళ్ల ఈ కుర్రాడి తలకు బంతి బలంగా తగలడంతో కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. మెల్ బోర్న్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ మెడకు బంతి బలంగా తగిలి చనిపోయాడు. ఇక బెన్ ఆస్టిన్ మృతి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా విషాదంలో కూరుకుపోయింది. బెన్ ఆస్టిన్ మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిని కోల్పోయినట్లు పేర్కొంది క్రికెట్ ఆస్ట్రేలియా.
మెల్‌బోర్న్ స్టేడియం సమీపంలో ఉన్న ఓ గ్రౌండ్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తూ బెన్ ఆస్టిన్ ( Ben Austin ) మరణించినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పూర్తి స్థాయి భద్రతతో అంటే హెల్మెట్ ధరించి, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడట బెన్ ఆస్టిన్ ( Ben Austin ). కానీ దురదృష్టవశాత్తు బంతి వేగంగా వచ్చి తలను కాకుండా మెడ భాగంలో గట్టిగా తగిలినట్లు చెబుతున్నారు. ఈ గాయం కాగానే బెన్ ఆస్టిన్ అక్కడికక్కడే కుప్పకూలి పడ్డాడట. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న వాళ్ళందరూ కలిసి మొనాష్ మెడికల్ సెంటర్ కు తరలించినట్లు చెబుతున్నారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగానే బుధవారం రోజున బెన్ ఆస్టిన్ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియాలో పెను విషాదం చోటుచేసుకుంది.
బంతి తగిలి గతంలో కూడా ఆస్ట్రేలియా ప్లేయర్ ఫిలిప్ హ్యూస్ ( Phillip Hughes ) మరణించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఫిలిప్ హ్యూస్ 2014 సంవత్సరంలో మరణించాడు. అతడు కూడా క్రికెట్ ఆడుతుండగానే మెడకు బంతి తగలడంతో గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ దాదాపు వారం రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిలిప్ హ్యూస్ మరణించాడు. అయితే ఫిలిప్ హ్యూస్ మరణ వార్త విన్న తర్వాత ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ లో కంకషన్ అలాగే భద్రత గేర్ కు సంబంధించిన కొత్త రూల్స్ కూడా అమలు చేస్తోంది.
Victorian community cricket has been numbed by the death of promising Ferntree Gully player, Ben Austin, described as an “awesome young man’’. Read the full story: https://t.co/knFg3eFdIG pic.twitter.com/AIsOapS6ki
— The Australian (@australian) October 29, 2025