BigTV English
Advertisement

Mechanic Rocky Glimpse: మాస్ కా దాస్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ రిలీజ్.. కార్ ఛేజింగ్ హైలైట్..!

Mechanic Rocky Glimpse: మాస్ కా దాస్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ రిలీజ్.. కార్ ఛేజింగ్ హైలైట్..!

Mechanic Rocky Glimpse Released: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుస హిట్లతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘గామి’ సినిమాతో వచ్చి సునామి సృష్టించాడు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘గామి’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ అందుకుంది. ఇందులో అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో వచ్చాడు.


ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకుంది. ఎన్నో అంచనాలతో వచ్చినా.. అంచనాలకు అందలేదు. కానీ మాస్ యాక్షన్ సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఇలా డిఫరెంట్ పాత్రలో.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ విశ్వక్ ముందుకు పోతున్నాడు. ఇక ఇందులో భాగంగానే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ వస్తున్నాడు. అదే ‘మెకానిక్ రాకీ’ మూవీ.

Also Read: మెకానిక్ రాకీగా విశ్వక్ సేన్.. కొత్త మూవీ పోస్టర్ భలే ఉంది కదా


రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇందులో భాగంగా గ్లింప్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రకారం.. ప్రధాన పాత్రలతో పాటు ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కడక్కడ యాక్షన్ సీన్లు కూడా చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ముఖ్యంగా కార్ ఛేంజింగ్ సీన్లు చూపించి మరింత ఆసక్తి పెంచేశారు.

ఇందులో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీగా కనిపించిన లుక్ అద్భుతంగా ఉంది. అతడి పాత్రలో ఉన్న మాస్ యాంగిల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ‘‘చోటే చోటే బచ్చో కో పూరోం కీ మై జవాబ్ దేతూ’’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా ‘‘డేంజర్ కే లైసెన్స్’’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ విశ్వక్ క్యారెక్టర్‌ని ఓ రేంజ్‌లో హైలైట్ చేస్తుంది. ఇక ఇందులో మీనాక్షి చౌదరి చాలా క్యూట్‌గా కనిపించగా.. మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఒక అర్భన్ అమ్మాయి పాత్రలో కనిపించి తన అందంతో ఆకట్టుకుంటుంది. అలాగే జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కూడా మరింత హైప్ పెంచుతుంది. మొత్తంగా ఇలా అన్ని ఎలిమెంట్లతో కట్ చేసిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. మరెందుకు ఆలస్యం మీరుకూడా ఈ మాస్ యాక్షన్ గ్లింప్స్ చూసి ఎంజాయ్ చేయండి

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×