Calling Name Presentation: అన్ నూన్ కాల్స్‌కు ఇకపై ఫుల్‌స్టాప్ పడబోతోందా? పదే పదే స్పామ్, ప్రమోషనల్ కాల్స్‌తో విసిగిపోయారా? సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో చేసే కాల్స్‌కు బ్రేక్ పడనుందా? ఆ తరహా కాల్స్‌పై టెలికాం ఆపరేటర్లు దృష్టి పెట్టారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇన్‌కమింగ్ కాల్స్‌కు మొబైల్‌లో డిస్ ప్లేలో వ్యక్తి పేరు
అన్‌నూన్, స్పామ్, డిజిటల్ అరెస్ట్ కాల్స్‌కు చెక్ పడబోతోంది. నాలుగైదు నెలల్లో వినియోగదారులు ఇకపై తమ మొబైల్ ఫోన్ వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్‌లో కాలర్ పేరును చూడవచ్చు. టెలికాం విభాగం మార్చి నాటికి ఆ ఫీచర్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం హర్యానాలో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
మొబైల్‌లో సేవ్ చేయని నెంబర్ నుండి కాల్ వస్తే ప్రస్తుతం కేవలం నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. మార్చి తర్వాత చేసే వ్యక్తి ఎవరో అనేది తెలుస్తోంది. చేసే వ్యక్తి ఎవరో తెలియక వినియోగదారులు ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించేవారు. కానీ మార్చి నుండి నెంబర్ ఎవరి గుర్తింపు కార్డుపై తీసుకుంటే వారి పేరు మొబైల్ ఫోన్ డిస్ ప్లే అయ్యేలా సన్నాహాలు చేస్తున్నాయి టెలికాం ఆపరేటర్లు.
హర్యానాలో మొదలు, మార్చినాటికి దేశవ్యాప్తంగా
ఒక్కో సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షిస్తున్నాయి మొబైల్ ఆపరేటర్లు. దేశవ్యాప్తంగా 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు టెలికాం వర్గాలు చెబుతున్నమాట. ఇప్పటికే హర్యానాలో CNAP పేరిట పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిందని DoT వర్గాలు తెలిపాయి. దేశంలోని ఏ ప్రదేశం నుంచి కాల్ చేసినా తెలియడం కోసం జియో.. హర్యానాలో అమలు చేస్తుందని తెలుస్తోంది.
ఇటీవలకాలంలో డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలు తీవ్రమయ్యాయి. ప్రజల నుంచి లక్షలకు లక్షలు సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అంతేకాదు సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఇలాంటి మోసపూరిత కాల్స్‌ను నిలువరించేందుకు కాలింగ్ నేమ్ ప్రజంటేషన్-CNAP సదుపాయాన్ని టెలికాం విభాగం ప్రతిపాదన చేసింది.
ALSO READ: ఇక ఫోన్‌తోనే కారు స్టార్ట్, శాంసంగ్ ఫోన్‌లో డిజిటల్ ఫీచర్
ఈ ప్రతిపాదనను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్-TRAI ఓకే చేసింది. ఫోన్ నెంబర్ కోసం వినియోగదారుడు గుర్తింపు కార్డులో పేరు కనిపించేలా చేయడానికి ట్రాయ్ ఓకే చేసింది. ఒకవేళ వినియోగదారుడు తన పేరు వద్దని అనుకుంటే దాన్ని డిస్‌ప్లే చేయరని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2జీ, 3జీ వినియోగదార్లకు అమలు చేయడం కష్టమని ట్రాయ్, డాట్ అన్నట్లు తెలుస్తోంది.
4జీ లేదా అంతకుమించి సాంకేతికత ఉన్న ఫోన్లకే వర్తింపజేయనున్నారు. ఈ ఫీచర్‌ని వొడాఫోన్, జియో సంస్థలు హర్యానాలో పరీక్షిస్తున్నాయి. దేశంలో ఎక్కువగా 3జీ ఫోన్లు ఉన్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతుందన్నది వాళ్లేనని అంటున్నారు. ఈ విషయంలో మొబైల్ ఆపరేటర్లు ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాలి.