Mega 158:టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న చిరంజీవి (Chiranjeevi ) ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సక్సెస్ తర్వాత మరో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రాజకీయాల నుండి మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి సినిమాలు చేస్తున్నారు కానీ బ్లాక్ బస్టర్ విజయాలను మాత్రం సొంతం చేసుకోవడం లేదు అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే యంగ్ డైరెక్టర్లకు చిరంజీవి అవకాశాలను కల్పిస్తూ సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేశారు. కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరొకవైపు ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేస్తున్నారు . ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అలాగే తనకు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన బాబీ కొల్లి డైరెక్షన్లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.
ALSO READ:Rajamouli: బాహుబలి 3 ప్రకటించేసిన రాజమౌళి.. ఈ అనౌన్స్మెంట్ గెస్ చేయనిది!
మెగా 158 అంటూ రాబోతున్న ఈ సినిమా షూటింగు ఈ ఏడాది ఆఖరిలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇకపోతే చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా ప్రముఖ మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika mohanan) హీరోయిన్ గా నటించబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ భారీగా వ్యాప్తి చెందడంతో మాళవిక కూడా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ” మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడితో నటించాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది.. అలాంటి సినిమాలో అవకాశం వస్తే కచ్చితంగా ఓకే చెబుతాను. కానీ ఇప్పుడు మెగా 158 సినిమాలో హీరోయిన్గా నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదు. దయచేసి ఇలాంటి ఫాల్స్ న్యూస్ నమ్మకండి” అంటూ ఆమె ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక నటిస్తోందంటూ వచ్చిన వార్తలన్నీ.. ఆమె క్లారిటీ ఇవ్వడంతో ఫేక్ అని తెలిసిపోయాయి. అయితే ఇంతలోనే ఇప్పుడు ఈ చిత్రంపై మరో న్యూస్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాబీ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి ఇంకా నటీనటులను ఎవరిని ఎంపిక చేయలేదని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.