E-Paper
Advertisement

Garuda Purana : గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకంటే నష్టమేనా..?

Garuda Purana : గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకంటే నష్టమేనా..?
Advertisement

Garuda Purana : గరుడ పురాణం గురించి చెబితే కొందర భయపడుతుంటారు. వ్యాసభగవానుడి 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. నరకం గురించి పాపుల శిక్షల గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు విష్ణువు చెప్పిన సమాధానాలు గరుడ పురాణంలో ఉన్నాయి. గరుడ పురాణం గురించి భయపడటానికి కారణం . నరకలోక వర్ణన , పితృలోక వర్ణన గురించి ప్రస్తావించారు ముఖ్యంగా ప్రేత కల్పము ఉండటం వల్ల దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అన్న సందేహాలు వస్తుంటాయి. ఏ పాపం చేస్తే ఏ నరకంలో పడతాం, ఎన్ని సంవత్సరాలు ఉంటాం, ఎన్ని జన్మాలు ఉంటాయి, ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, పాపానికి ఫలితం ఎలా ఉంటుంది ఇలా నరకలోక శిక్షలు గురించి ఉంటాయి. ప్రతీ అధ్యాయంలో పరమభీకర వర్ణన ఉంటుంది. భూలోకంలో ఇష్టవచ్చినట్టు తప్పులు చేస్తే పడే శిక్షలు ఏంటో కళ్లకు కట్టినట్టు గరుడ పురాణం వివరిస్తుంది. అలాంటి పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవడంలో తప్పులేదని పండితులు చెబుతున్నారు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే 12రోజులపాటు గరుడ పురాణం పఠిస్తుంటారు. మరణించిన తర్వాత వ్యక్తి ఎలా వెళ్తాడు, శరీరం నుంచి ఆత్మ ఎలా వస్తుంది, ఆత్మ ఎక్కడెక్కడ ఎలా ప్రయాణం చేస్తుంది., ఎక్కడ ఆగుతుందన్న వివరాలు గరుడ పురాణాల్లో ఉంది. అలాంటి వివరాలు మనం చూడలేం. తెలియదు కూడా. అలాంటి విషయాలు గరుడ పురాణం చెబుతుంది. చనిపోయాక ఏం జరుగుతుందో వాళ్లు మనకు చెప్పలేరు. అలాంటి వైజ్ఞానిక విషయాలను చెప్పేది అపురూప పురాణం ఒక్కటే. మరణించిన తర్వాత ఆ వెనుక ఏం జరుగుతుందో చెప్పే పురాణం కాబట్టి ఇంట్లో ఉంచకూడదని కొందరు భయపడుతుంటారు. అలాంటి భయాలు అవసరం లేదని నిక్షేపంగా గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×