E-Paper
Advertisement

Prabhas Maruthi Movie : పాత థియేట‌ర్‌లో ప్ర‌భాస్‌కు ప‌నేంటి!

Prabhas Maruthi Movie : పాత థియేట‌ర్‌లో ప్ర‌భాస్‌కు ప‌నేంటి!
Advertisement

Prabhas Maruthi Movie : బాహుబ‌లితో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న మ‌న టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్ర‌భాస్‌. ఈయ‌న వ‌రుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ అందరి దృష్టిని త‌న వైపు తిప్పుకుంటున్నారు. ఈయ‌న చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ కాకుండా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను రీసెంట్‌గానే షురూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్త‌య్యింది. కాగా.. డిసెంబ‌ర్ రెండో వారం నుంచి రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్ పాల్గొన‌బోతున్నారని సినీ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే స్టార్ట్ కాబోతున్న రెండో షెడ్యూల్ కోసం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ పాత కాలం నాటి థియేట‌ర్‌లో షూటింగ్ సెట్‌ను సిద్ధం చేశారట‌. అందులో ప్ర‌భాస్ స‌హా ముగ్గురు హీరోయిన్స్ కూడా పాల్గొన‌బోతున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు జ‌త‌గా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్‌, ప్రాజెక్ట్ K వంటి భారీ సినిమాల‌ను కూడా పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. మ‌రో వైపు వ‌చ్చే ఏడాది జూన్ 16న ప్ర‌భాస్ న‌టించిన మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీ మూవీ ఆది పురుష్ విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌బోతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×