Big Stories

Srisailam:శ్రీశైలం వెళ్లడం మరింత ఈజీగా

Srisailam:మహాశివరాత్రి సందర్భంగా వివిధ తీర్థయాత్ర కేంద్రాలను సందర్శించేందుకు భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజియన్ ప్రత్యేక బస్సు సర్వీసుల నడపనుంది. శ్రీకాళహస్తి, తలకోన, కైలాసకోన, మూలకోన, గుడిమల్లం, సదాశివకోన, అవతి సహా ఏడు పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పండుగకు ఒకరోజు ముందు నుంచి పండుగ త‌రువాత రోజు వ‌ర‌కు బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఏడు పవిత్ర స్థలాలకు తిరుపతి, మంగళం, శ్రీకాళహస్తి, పుత్తూరు, సత్యవేడు బస్‌ డిపోల నుంచి ఈ బస్సులను నడపాలని, ప్రత్యేక బస్సుల ద్వారా రూ.53 లక్షల ఆదాయం సమీకరించాలని ఆర్టీసీ యోచిస్తోంది.

- Advertisement -

బస్సు సిబ్బందికి తగిన సంఖ్యలో టికెట్ జారీ చేసే యంత్రాలు, అన్ని బస్ స్టేషన్‌లు మరియు క్యాంపులలో అధికారులు, సూపర్‌వైజర్‌లను నిమగ్నం చేయడంతో పాటు బస్సు సర్వీసులు ఎలాంటి ఆలస్యం లేకుండా సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు రన్నింగ్, సహాయక సిబ్బందికి ఆహార ఏర్పాట్లు, తాగునీరు వంటి సౌకర్యాలు అన్ని బస్ స్టేషన్లలో పారిశుధ్యం నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

తెలంగాణ ఆర్టీసీ కూడా పోటా పోటీగా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీమహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి వెళ్లే వారికోసం 390 స్పెషల్ బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి మొత్తం 390 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 16 నుంచి 19 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలానికి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.600, డీలక్స్‌లో రూ.540, ఎక్స్‌ప్రెస్ లో రూ.460 తీసుకుంటారు. ఇతర ప్రాంతాల నుంచి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.650, డీలక్స్‌లో రూ.580, ఎక్స్‌ప్రె్‌స్‌లో రూ.500 వసూలు చేస్తారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ నడుస్తోంది. ముందస్తు రిజర్వేషన్ల కోసం మరిన్ని వివరాల కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించవచ్చు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News