E-Paper
Advertisement

Gruhapravesam:గృహ ప్రవేశం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా…

Gruhapravesam:గృహ ప్రవేశం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా…
Advertisement

Gruhapravesam:ఎన్నో ఆశలతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకునే ఇంటిలో ఉండాలనే కల ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఆ కల నెరవేరే సమయం వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గృహప్రవేశం చేసేటప్పుడు. ఇళ్లు నిర్మాణం పూర్తై ఇల్లు మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త ఇంట్లోకి వెళ్లడం మంచిది. పూజకు తేదీని నిర్ణయించే ముందు, తలుపులు వంటి అన్ని ప్రధాన ఉపకరణాలతో ఇల్లు సిద్ధంగా ఉందని నిర్దారించుకున్నాకే గృహ ప్రవేశం చేయాలి. అలాగే, పూజా రోజు రాత్రి, మీ కుటుంబంతో మీ కొత్త ఇంటిలో నిద్రించే పరిస్థితి ఉండాలా చూసుకోవాలి.

సింహద్వారం ప్రత్యేకం
మెయిన్ డోర్ లేదా ప్రధాన ఇంటి ప్రవేశ ద్వారం మంచి ఆరోగ్యం, శ్రేయస్సుకి ఎంట్రన్స్ గేట్ లాంటింది. అందుకే సింహ ద్వారాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించాలి. మీ ప్రధాన ద్వారం స్వాగతించేలా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. ప్రవేశ ద్వారం వద్ద రంగోలిని స్వస్తిక లేదా లక్ష్మీదేవి పాదాల వంటి మతపరమైన చిహ్నాలను తయారు చేయవచ్చు.

Advertisement

కొబ్బరికాయ శుభప్రదం
ఇంట్లోకి అడుగు పెట్టే ముందే ప్రవేశ ద్వారం వద్ద కొబ్బరికాయ పగలగొట్టాలి. కొబ్బరికాయను పగలగొట్టే ఆచారం ఇంటిని పవిత్రం చేస్తుంది. ఎంట్రన్స్ నుంచి ఏవైనా అడ్డంకులు ఎదురైతే తొలగిస్తుందని నమ్ముతారు.

గృహ ప్రవేశ పూజ రోజున రాత్రంతా ఇంటికి తాళం వేసి బయటకు రాకూడదు. దైవిక రక్షణను ఆకర్షించడానికి మీరు తప్పనిసరిగా దీపం వెలిగించాలి. అలాగే ఇంటిని ఖాళీగా ఉంచకూడదు. గృహ ప్రవేశ పూజ జరిగిన మూడు రోజులలోపు, మీరు అవసరమైన అన్ని వస్తువులతో ఇంటిని నింపాలి. కుటుంబంలోని గర్భిణీ స్త్రీలు లేదా కుటుంబ సభ్యులెవరైనా లేదా దగ్గరి బంధువు మరణానికి సంతాపం తెలిపే సందర్భంలో గృహప్రవేశ వేడుకలను నిర్వహించకూడదు. .

Advertisement

Somnath Jyotirling Temple:బాణస్తంభం వెనుక రహస్యమిదేనా…?

Gomati Chakra:గోమతీ చక్ర వృక్షంతో కలిగే ఫలితాలేంటి?

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×