EPAPER

Horoscope 17 September 2024: ఈ రాశి వారికి అడ్డంకులే.. దూకుడు తగ్గించుకుంటే మంచిది!

Horoscope 17 September 2024: ఈ రాశి వారికి అడ్డంకులే.. దూకుడు తగ్గించుకుంటే మంచిది!

Astrology 17 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, హోదా పెరుగుతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. గ్రహస్థితి అనుకూలిస్తుంది. భరణి నక్షత్ర జాతకులు కొత్త పనులను మధ్యాహ్నం తర్వాత ప్రారంభిస్తే మంచిది. ఇష్టదేవతారధన శుభకరం.

వృషభం:
వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సంపద వృద్ధి చెందుతుంది. ఊహించని ప్రమోషన్స్ వస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సూర్య ఆరాధన శుభప్రదం.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించేందుకు అనుకూలం. వృత్తి, వ్యాపార రంగాల వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉండవచ్చు. ఉన్నతాధికారులు మీ పనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇష్టదైవ సందర్భన శుభప్రదం.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కీలక పనుల్లో అడ్డంకులే ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సమయాన్ని వృథా చేయకండి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నవగ్రహ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక నష్టాలు రావొచ్చు. చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే అనవసరమైన సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

కన్య:
ఈ రాశి వారికి అదృష్టకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబసభ్యులతో కలిసి విజయాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆంజనేయస్వామి ధ్యానం శుభప్రదం.

Also Read: నవరాత్రుల్లో 9 రోజులు ఇలా చేస్తే భవాని మాత అన్ని సమస్యలను తొలగిస్తుంది

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. చేపట్టిన పనులను సకాలంలో పెద్దల సలహాలు పూర్తి చేస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొందరి ప్రవర్తన ఇబ్బందులకు గురిచేస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆదాయం వృద్ది చెందుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒక శుభవార్తతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శనికి తైలాభిషేకం శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి అదృష్టం, సంపద కలిసి వస్తుంది. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రణాళికతో ముందడుగు వేయాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రణాళికతో ముందుకు సాగాలి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రీరామరక్షాస్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

మకరం:
మకర రాశి వారికి అద్భుతంగా ఉంది. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలు ఉంటాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఊహించని అదృష్టం వరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమ్యలు వస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కుంభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు వరిస్తాయి. ప్రారంభించిన పనుల్లో విజయం పొందుతారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సకాలంలో పూర్తిచేస్తారు. కీలక వ్యవహారంలో తోటివారి సహాయం తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఉంటుంది. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆస్తి వ్యవహారాల్లో ప్రతికూలతలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది.

Related News

Mangal Gochar: కుజుడి సంచారం.. అక్టోబర్ 20 నుంచి వీరి సంపద రెట్టింపు

Weekly Horoscope 14- 20 October: అక్టోబరు మూడవ వారంలో ఈ 6 రాశుల వారి శ్రమకు తగిన ఫలితాలు రాబోతున్నాయి

Panchak October 2024: దసరా ముగియగానే మొదలైన పంచకం.. పొరపాటున కూడా ఈ పని చేయకండి

Money Plant Vastu: ఇలాంటి మనీ ప్లాంట్ ఇంట్లో నాటితే అశుభం.. మీ డబ్బులన్నీ గోవిందా..

Horoscope 13 october 2024: ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు.. ఇలా చేస్తే పరిష్కారం!

Shukra Gochar 2024: రేపటి నుండి మేషం సహా ఈ 3 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

Vivaha Muhuratham 2024: నవంబర్, డిసెంబర్‌లో పెళ్లికి అద్భుతమైన 18 శుభ ముహూర్తాలు..

Big Stories

×