BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : హౌస్ మెట్స్ మధ్య గుడ్డు గొడవ.. ఇదేం రచ్చ రా నాయనా..

Bigg Boss 8 Telugu : హౌస్ మెట్స్ మధ్య గుడ్డు గొడవ.. ఇదేం రచ్చ రా నాయనా..

Bigg Boss 8 Telugu :  బిగ్ బాస్ 8 తెలుగు రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. మొదటి రెండు వారాల నామినేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇద్దరు హౌస్ మెట్స్ ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్లారు. ఇప్పుడు మూడో వారం నామినేషన్స్ కోసం బిగ్ బాస్ సరికొత్త ప్లాన్ వేసిందని చెప్పాలి.. సోమవారం ఎపిసోడ్ లో మూడో వారం నామినేషన్స్ ప్రక్రియను కొత్తగా మొదలు పెట్టారు.. గత వారం రంగు పోస్తే, ఈ వారం చెత్త పోసి నామినేట్ చెయ్యమని బిగ్ బాస్ హౌస్ మెట్స్ కు చెప్పాడు. ఈ క్రమంలో ఈ వారం నామినేషన్స్ చెత్తలో హీటేక్కించాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ విశేషాలు ఏంటో? నామినేషన్ గురించి ఒకసారి మన బిగ్ టీవీ లో చూసేద్దాం..


ప్రతిసారి నామినేషన్ ప్రాసెస్ మొదలైతే కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఎలా తిట్ల దండకం మొదలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మూడవ వారం నామినేషన్ ప్రాసెస్ లో ఆ హీట్ మరింత పెరిగింది. బిగ్ బాస్ లో 15 రోజు నామినేషన్స్ మొదలయ్యాయి. కంటెస్టెంట్స్ లో వ్యర్థాలు లాగా పేరుకుపోయిన బ్యాడ్ క్వాలిటీస్ ని వదిలేయాలి అనే ఉద్దేశంతో పేరు అలా పెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. కారణాలు చెప్పి వాళ్ళ తలపై చెత్త పోయాలి.. ముందుగా కిరాక్ సీతను నామినేట్ చెయ్యమని బిగ్ బాస్ చెప్తాడు. ఆమె మొదటగా యాష్మిని నామినేట్ చేసింది. ఆమె చీఫ్ గా ఉన్నప్పుడు క్లాన్ ని సరిగ్గా కంట్రోల్ చేయలేదని, పక్షపాత ధోరణి ప్రదర్శించింది అని రెండు మూడు కారణాలు చెప్పింది. అదే విధంగా పృథ్వీని కూడా నామినేట్ చేస్తూ పక్కనోళ్ళని తొక్కి ఎదగాలనే లక్షణం తనలో నచ్చలేదని సీత తెలిపింది.

Nominations are the third week in the Bigg Boss house
Nominations are the third week in the Bigg Boss house

ఆ తర్వాత ప్రేరణ విష్ణు ప్రియను నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య గుడ్డు అనే టాపిక్ హైలెట్ అయ్యింది. విష్ణు ప్రియా రెండు గుడ్లు వేసుకుందని ప్రేరణ రచ్చ రచ్చ చేసింది. ఇక నబీల్ ప్రేరణ మధ్య పెద్ద వార్ జరిగింది. కాసేపు వీరి వాదనతో హౌస్ హీటేక్కి పోయింది. ఇక మణికంఠ.. యాష్మి, పృథ్విని నామినేట్ చేశాడు. మణికంఠ, యాష్మి ఇద్దరూ ఆర్గుమెంట్ చేసుకుంటూ లిమిట్ క్రాస్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే యాష్మినే సహనం కోల్పోయింది. ఆమె నోటి వెంట ‘ఏంటి బొక్కా’ అనే బూతులు కూడా వచ్చాయి. దీని వల్ల యాష్మి నెగిటివిటిను అందుకొనే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.


మణికంఠతో వాగ్వాదానికి దిగింది. ఇంతకాలం నువ్వు నా దగ్గర ఫ్రెండ్ లాగా డ్రామా చేసావు అంటూ యాష్మి ఆరోపించింది. నీలో బ్యాడ్ క్వాలిటీ ఉంటే తప్పకుండా రైజ్ చేస్తా అని మణికంఠ అన్నాడు. పృథ్విని మణికంఠ నామినేట్ చేశాడు. ఇక ఆదిత్య ఓం.. విష్ణుప్రియ, మణికంఠని నామినేట్ చేశాడు. ఎప్పటిలాగే తన పాయింట్స్ ని బలంగా చెప్పలేక ఆదిత్య ఓం తేలిపోయాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ తో నామినేషన్స్ పూర్తి కావొస్తుంది. ఈ వారం నిఖిల్, అభయ్ ఇద్దరూ చీఫ్ లు అందుకే వాళ్ళకి నామినేషన్ వర్తించదు అంటూనే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. నిఖిల్,అభయ్ లలో ఒకరు మాత్రమే నామినేషన్ నుంచి సేఫ్ అవుతారు. ఒకరు నామినేట్ కావలసిందే. అది ఎవరో వాళ్లిద్దరే తేల్చుకోవాలి అంటూ మెలిక పెట్టారు. నిఖిల్ ఆల్రెడీ రెండు సార్లు నామినేషన్స్ లో ఉన్నాడు. ఇక అభయ్ అతడి కోసం త్యాగం చేశాడు. ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్లు ప్రేరణ, నైనికా, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యాష్మి, అభయ్.. ఇదీ మూడవ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్.. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారో చూడాలి.. ఈ వారం ఎలిమినేషన్ తో పాటుగా వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. గీతూ రాయల్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్..

Related News

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Big Stories

×