Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్ 4న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ధనసహాయం అందుతుంది.
వృషభం: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. స్వస్థానమున ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
మిధునం: చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. ముఖ్యమైన విషయాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
కర్కాటకం: నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో ప్రభుత్వాధికారులు నుండి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.
సింహం: దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య : చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు
తుల: ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.
వృశ్చికం: వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
ధనస్సు: కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ధన వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి. నూతన వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం: దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
మీనం: కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్