BigTV English

Horoscope Today January 23rd: ఆ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది 

Horoscope Today January 23rd: ఆ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది 

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 23న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.


మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశములు అందుతాయి. విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు భూవివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంతానానికి విద్య ఉద్యోగ అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీన రాశి : ఈ రాశి నిరుద్యోగులకు ఇవాళ శుభవార్తలు అండుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

Related News

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Big Stories

×