Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. నిజానికి స్టార్ హీరోలతో సినిమాలు అంటే నిర్మాతలకు కాసుల పంట పండినట్టే అని చాలామంది అనుకుంటారు. కానీ అదే పొరపాటు. ఇండస్ట్రీలో పేరు ఉన్న హీరోలతో సినిమాలు తీయాలంటే నిర్మాతలకు చెమటలు పడుతున్నాయి. సినిమా హిట్ అయితే లాభాల పంట పండినట్లే.. అదే సినిమా ఫ్లాప్ అయితే చరిత్రలో మిగిలిపోయేలా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో స్టార్ హీరోలతో తీసిన సినిమాలే యావరేజ్ నాకు అందుకుంటున్నాయి. ఇన్ని సినిమాలు డిజాస్టర్ గా మారి భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అలా ఇప్పటివరకు స్టార్ హీరోలో నటించిన ఫ్లాప్ మూవీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఒక్క మగాడు..
నందమూరి నటసింహం బాలయ్య నటించిన ఒక్కమగాడు సినిమా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి. కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసింది.. ఈ మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాలేదని అప్పట్లో టాక్..
రెబల్..
టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ రెబల్.. ప్రభాస్ కెరియర్ లో అత్యధిక నష్టాలు తీసుకువచ్చిన సినిమా రెబల్. అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్ తో గొడవ పడ్డారు. నిర్మాతలు భగవాన్, పుల్లారావు.. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా వరకు వెళ్ళింది..
శక్తి..
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ శక్తి.. భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలను మా రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమాను నిర్మించారు అశ్వినీ దత్.. ఈ సినిమా నష్టాలనుంచి బయటపడడానికి నిర్మాతకు చాలా వెళ్లే పట్టింది..
తుఫాన్..
మెగా హీరో రామ్ చరణ్ నటించిన ఫ్లాప్ మూవీలలో తుఫాన్ ఒకటి. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న రామ్ చరణ్ కు ఈ సినిమా దారుణంగా రిజల్ట్ ను ఇచ్చింది.
అజ్ఞాతవాసి..
పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై నభూతో అనే అంచనాలు ఉన్నాయి. కానీ విడుదల తర్వాత ఫ్లాప్ అయిపోయింది అజ్ఞాతవాసి. దాదాపు 55 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం.
వీటితోపాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్, ఆగడు, కొమరం పులి, బ్రహ్మోత్సవం, వెంకటేష్ నటించిన షాడో, నాగార్జున నటించిన మన్మథుడు 2 భారీ అంచనాలతో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కనీసం టాక్ ని కూడా నిలుపుకోలేకపోయాయి.. ఇప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో అని తెలియకుండానే ఈ సినిమాలు కనుమరుగయ్యాయి..
ఇక ఈమధ్య అయితే స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లోకి వచ్చిన చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంటున్నాయి. అంతేకాదు సినిమాలకి షాక్ ఇచ్చేలా కలెక్షన్స్ ను కూడా అందుకుంటున్నాయి..