BigTV English

Horoscope Today May 20th : ముఖ్యమైన వ్యవహారాలలో విజయం – నిరుద్యోగులకు శుభవార్తలు  

Horoscope Today May 20th : ముఖ్యమైన వ్యవహారాలలో విజయం – నిరుద్యోగులకు శుభవార్తలు  

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మే 20 ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం: నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కీలక విషయాల్లో ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం: ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది. నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది.


మిధునం: ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

సింహం: చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.

కన్య: వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. ఇంట్లో వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృశ్చికం: ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు:  ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు పొందుతారు.  సోదరుల నుండి స్థిరాస్తి లాభం అందుకుంటారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

మకరం: వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది.

కుంభం: అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు.

మీనం: ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Big Stories

×