Hari Hara Veera Mallu: టాలీవుడ్ స్టార్ హీరో, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు.. ఈ సినిమాని అనౌన్స్ చేసి చాలా కాలమే అయింది.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. దాంతో మూవీ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఇప్పటికే రెండుసార్లు అనుకున్న డేట్ పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త డేట్ ని అనౌన్స్ చేశారు. దాంతో ఫాన్సు ఫుల్ ఖుషి అవుతున్నారు తమ హీరో సినిమాని ఇన్నాళ్లకు థియేటర్లలో చూడబోతున్నామని ఇప్పటినుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే బెనిఫిట్ షోస్, స్పెషల్ షోలు, ఫ్యాన్స్ షోలు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఆర్భాటాలు హంగులు ఉంటాయి.
డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా టికెట్ ధర పై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వీరమల్లు టికెట్ ధర ఎంతంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబినేషన్లో రాబోతున్న సినిమా హరిహర వీరమల్లు.. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం ఆధారంగా రూపొందించారు.. గతంలో షూటింగ్ పూర్తయింది త్వరలోనే థియేటర్లలో కలుసుకుందాం అంటూ సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు. మొదటినుంచి ఈ సినిమాపై కాస్త ఎక్కువగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫాన్స్ నిరాశలో ఉండిపోయారు. మే 9న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తర్వాత జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడేమో జూన్ 12న సినిమా రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా టికెట్ ధరలపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాను వినిపిస్తున్నాయి..
అవేంటంటే.. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ వెయ్యి రూపాయిల వరకు ఉంటాయట. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో ఇదే రేట్స్ ఉంటాయా, లేకపోతే బి, సి సెంటర్స్ లో కాస్త తక్కువ రేట్స్ ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది. జూన్ 11 న అర్ధరాత్రి 12 గంటల నుంచి బెనిఫిట్ షో మొదలవుతాయి. బెనిఫిట్ షోలలో ఒక్కో టికెట్ ధర దాదాపుగా రూ. 1000కి పైగా ఉండవచ్చు అని తెలుస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి..
ఇక ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించబోతున్నాడు. సినిమా రిలీజ్ అవుతున్న టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ని మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉండడంతో ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటాడో లేదో అన్నది ఆసక్తిగా మారింది. ఇకపోతే ఈ మూవీ నుంచి గత కొన్ని రోజులుగా అప్డేట్స్ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటని రిలీజ్ చేస్తే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు..