BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి డబ్బే డబ్బు! 

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి డబ్బే డబ్బు! 

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఈ రోజు ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వంటి వివరాలను జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో ఒత్తిడికి గురవుతారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. యోగా, ధ్యానం చేస్తే మంచిది. శివనామాన్ని జపించాలి.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలత లేదు. కీలక వ్యవహారాల్లో ప్రతి కూల ఫలితాలు ఉంటాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు విషయంతో జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు ఉంటాయి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.


మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పెద్దలు, ఆత్మీయుల సలహాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సమాజంలో ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. విహారయాత్రలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన అన్ని పనుల్లో విజయం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత డబ్బు సమకూరుతుంది. అన్ని రంగాల వారికి కలిసివస్తుంది. బంధువుల సహకారంతో కీలక పనులు విజయవంతమవుతాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. దుర్గా ధ్యానం శుభప్రదం.

సింహం:
సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల వారికి ఊహించిన విధంగా లాభాలు వస్తాయి. మిత్రులతో సంతోషంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సమాజంలో ప్రశంసలు ఉంటాయి. లక్ష్మీ స్తోత్రం చదవితే మంచిది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో గొడవలు లేకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం  ఉంటుంది. కీలక వ్యవహారాల్లో కష్టపడిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించాలి.

తుల:
తుల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. అవసరానికి డబ్బు సమకూరుతుంది. తోటి మిత్రులతో ఆచితూచి వ్యహరించాలి. దైవబలం అండగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరుల సలహాలుతో పనులు పూర్తి చేస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమువుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు ఉంటాయి. ముఖ్యమైన పనుల కోసం డబ్బును ఖర్చు చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. విశ్రాంతి అవసరం. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడంతో శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం:
కుంభ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. అన్ని రంగాల వారికి ఊహించని ధనలాభాలు ఉంటాయి. యశస్సు వృద్ది చెందుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

మీనం:
మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశాజనకంగా లేదు. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. భయాందోళనకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేసుకోవాలి. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంకిత భావం, చిత్త శుద్ధితో ఉంటే మంచిది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×