BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి స్వర్ణాభరణ యోగం!

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి స్వర్ణాభరణ యోగం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..12 రాశుల్లో ఏ రాశి వారికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ధన యోగం ఎవరికి వరిస్తుందనే వివరాలపై జ్యోతిష్యులు ఎం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందుతారు. కీలక పనులను వాయిదా వేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. లక్ష్మీ దేవీ ఆరాధన మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. పట్టుదలతో సవాళ్లను అధిగమించాలి. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ధనయోగం సూచితం. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదైవాన్ని పూజించాలి.


మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కీలక సమయాల్లో తెలివిగా వ్యవహరించాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. పెద్దల సలహాలతో ఆపద నుంచి బయటపడతారు. స్వర్ణాభరణ యోగం ఉంది. శుభవార్త వింటారు. సూర్యభగవానుడిని ఆరాధించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారుకలు కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణసదుపాయం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విష్ణుమూర్తిని ధ్యానించాలి.

సింహం:
సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం కానుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

కన్య:
కన్య రాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారులు సృజనాత్మకతతో విజయాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులనుంచి బయటపడుతారు. లక్ష్మీదేవిని ధ్యానించాలి.

తుల:
ఈ రాశి వారికి ఆనందకరంగా ఉంటుంది.అన్ని రంగాల్లో పట్టిందల్లా బంగారమే కానుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కీలక నిర్ణయాల్లో సరైన ఆలోచన తీసుకోవాలి. ఓపికతోపాటు నమ్మకంగా ఉండాలి. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు. ఇతరుల నుంచి సహాయం పొందుతారు. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి.

వృశ్చికం:
ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల నుంచి ప్రశంసులు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇతరుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇష్ట దైవాన్ని ఆరాధించాలి.

ధనస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ధన యోగం ఉంది. బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించాలి.

మకరం:
మకర రాశి వారికి అద్భుతంగా ఉంది. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. బుద్ధిబలంతో ఆటంకాలు తొలగించుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి అధికంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా సాగిపోతాయి. తక్షణ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాగేంద్రుడిని స్మరించాలి.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇష్టదేవారాధన మేలు చేస్తుంది.

మీనం:
ఈ రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. గణపతి ప్రార్థన శుభకరం.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×