E-Paper
Advertisement

National :‘సత్సంగ్’ దర్యాప్తు ముమ్మరం .. భోలే బాబాపై కేసు నమోదు

National :‘సత్సంగ్’ దర్యాప్తు ముమ్మరం .. భోలే బాబాపై కేసు నమోదు
Advertisement

Case file on Bhole Baba Satsang stampage incident 121 death

121 మందికి పైగా మృతిచెందిన సత్సంగ్ దుర్ఘటనకు సంబంధించి ఎట్టకేలకు ఆ ఘటనకు మూలకారకుడైన భోలే బాబాపై బీహార్ లో కేసు నమోదయింది. జులై 2న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే నాలుగు రోజుల తర్వాత పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో భోలేబాబాపై కేసు నమోదయింది. ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని , భద్రతా సిబ్బంది భక్తులను తోసివేయడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సత్సంగ్ కార్యక్రమం వేదిక నుంచి తాను వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు బాబా. పైగా ఈ సంఘటన వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉండొచ్చని భోలేబాబు చెబుతున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉండాలని తమ ఆశ్రమ కమిటీ సభ్యులను ఆయన కోరారు.

Advertisement

దర్యాప్తు వేగవంతం
భోలే బాబా తరపున ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించిన దేవ ప్రకాష్ మధుకర్ ను గత శుక్రవారమే సికిందరావు పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు దేవ ప్రకాష్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. తొక్కిసలాట కేసులో అరెస్టయిన మరో నిందితుడు రాంప్రకాష్ షాక్యాను కూడా ఆదివారం కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన హథ్రాస్ పోలీసులు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. భోలేబాబాకు అండగా ఉంటూ వస్తున్న రాజకీయ శక్తులు ఎవరు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఏ క్షణమైనా భోలే బాబా అరెస్ట్ ఉండవచ్చు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×