E-Paper
Advertisement

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అంతటా విజయమే!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అంతటా విజయమే!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంది. ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది అనే వివరాలపై జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సమయాల్లో మానసిక ప్రశాంతత కోల్పోతారు. కీలక ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయ. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తి చేసేందుకు చిత్తశుద్ధి అవసరం. ఏకాగ్రత, పట్టుదల ఉంటే విజయం సాధిస్తారు. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శివారాధన మంచిది.

మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. చెడు విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఆలోచనతో వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి. మనోధైర్యం కోల్పోవద్దు. ప్రారంభించిన పనులు ఆలస్యం కావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. దైవారాధన మానవద్దు.

సింహం:
సింహ రాశి వారికి లాభదాయంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఊహించని ఫలితాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభం వరిస్తుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. ఆంజనేయుడిని ఆరాధించాలి.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో అంతటా విజయమే. ముఖ్యంగా ఉద్యోగాల్లో పదోన్నతి పొందుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆస్తులు అందుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించాలి.

తుల:
తులరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు పదింతలు లాభం పొందుతారు. ప్రయాణాలు ఉంటాయి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. లక్ష్మి ధ్యానం శుభకరం.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఇబ్బందులు ఎదురైతే విచక్షణతో వ్యవహరించాలి. ఆర్థికంగా నష్టపోవచ్చు. కొత్త పనులు వాయిదా వేయడం మంచిది. వేంకటేశ్వర సందర్శన శుభప్రదం.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో తోటి వారికి సహకారం లభిస్తుంది. అన్ని రంగాల వారికి పనుల్లో ఆటంకాలు తొలగిపోవడంతో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆదాయం, సంపద వృద్ది చెందుతుంది. శుభవార్త వింటారు. ఇబ్బంది పెట్టిన వారే మీ సహాయం కోరుతారు. ఇష్టదేవతారాధన మంచిది.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. సంతోషంగా గడిచిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక ఒప్పందాలపై దూరంగా ఉండడం మంచిది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులకు హామీలు ఇవ్వకపోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయాలి. అభయ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించాలి.

మీనం:
మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో సమస్యలు వస్తాయి. శనీశ్వరుడిని తైలాభిషేకం చేయిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×