BigTV English

BSP President Murder: బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య..అందరూ చూస్తుండగానే!

BSP President Murder: బీఎస్పీ అధ్యక్షుడి దారుణ హత్య..అందరూ చూస్తుండగానే!
BSP Tamil Nadu President Hacked To Death: తమిళనాడులో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కె ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నైలోని పెరంబూర్‌లో ఆయన నివాసానికి సమీపంలో శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట నిల్చుని ఉండగా.. బైక్‌పై వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఆయనను కత్తితో కిరాతంగా నరికారు. అనంతరం దుండగులు అక్కరి నుంచి పర్యారయ్యారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్ స్టాంగ్‌ను స్థానికులు థౌజండ్ లైట్స్ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే మృతి చెందారు. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరిపై దుండగులు దాడి చేయగా..గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సెంబియం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఆర్మ్ స్ట్రాంగ్ మృతదేహాన్ని చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆర్మ్ స్ట్రాంగ్ హత్యకు గురికావడంపై ఆ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యను తీవ్రంగా ఖండించారు. వృతిరీత్యా న్యాయవాది, రాష్ట్రంలో బలమైన దళితవాణిగా పేరుగా పొందారని, రాష్ట్ర ప్రభుత్వం దోషులను శిక్షించాలని మాయావతి డిమాండ్ చేశారు.
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య ఘటనపై బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించాడు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు.  కాగా, ఆర్మ్ స్ట్రాంగ్ హత్య నేపథ్యంలో సీఎం పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలంటూ పలు పార్టీలన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గతేడాది జరిగిన గ్యాంగ్ స్టర్ ఆర్కట్ సురేష్ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఇదివరకే పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. కొంతమంది రౌడీ ముఠాలతో పాతకక్షలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.  ఈయన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు.


Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×