E-Paper
Advertisement

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని ఆదాయం!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఊహించని ఆదాయం!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..మొత్తం 12 రాశులు. ఇందులో  ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.? ఏ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది.? సమస్యల నుంచి గట్టేందుకు ఎలాంటి పనులు చేయూడదు? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం సమకూరుతుంది. కీలక పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి డబ్బు  అందుతుంది. గురు శ్లోకాలు ఆరాధిస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కీలక సమయాల్లో మనోబలం కోల్పోకుండా విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు చేసిన పనికి గుర్తింపు వస్తుంది. తోటి ఉద్యోగుల సహకారంతో కీలక పనులు పూర్తవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దేవతారాధన మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తిచ ఉద్యోగాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్యానికి గురవుతారు. సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అవరోధాలు ఎదురైనా విజయం సాధిస్తారు. మోహమాటంతో సమస్యలు ఎదురుకావొచ్చు. అనవసరంగా ఖర్చులు చేస్తారు. ఎవరినీ అతిగా నమ్మకండి. ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు శుభవార్త వింటారు. వ్యాపారులు భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగంలో స్థానచలనం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

తుల:
తుల రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. పెద్దల సలహాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఊహించని ఆదాయం సమకూరుతుంది. ప్రయాణాలు ఉంటాయి. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ కాలం. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో బుద్ధి బలంతో పనులను పూర్తి చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారాల్లో ఆచితూచి వ్యహరించాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలి. అన్ని రంగాల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో ఖర్చులు పెరగవచ్చు. ఇష్టదేవతా ఆరాధన మేలు చేస్తుంది.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల వారు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలి. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతోంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం ఉంటుంది. వ్యాపారాలు ఆర్థికంగా ఊహించని లాభాలు అందుకుంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. శ్రీలక్ష్మి ధ్యానం మంచిది.

కుంభం:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సలహాలు తీసుకుంటారు. వృతి, ఉద్యోగాల్లో ఊహించని ధన లాభాలు ఉండవచ్చు. మీ ప్రతిభకు ప్రశంసలు ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. గణపతి ఆలయాన్ని సందర్శన శుభప్రదం.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సమయాన్ని వృథా చేయకుండా ప్రారంభించిన పనులపై శ్రద్ధ పెడితే విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. పెద్ల సూచనలు ఉపకరిస్తాయి. దేవి ధ్యానం మంచిది.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×