BigTV English

Joe Biden positive for Covid-19: అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్, ప్రచారానికి బ్రేక్

Joe Biden positive for Covid-19: అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్, ప్రచారానికి బ్రేక్

Joe Biden positive for Covid-19: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పరిస్థితి ఏంటి? డెమోక్రటిక్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? రిపబ్లికన్లకు అప్పగిస్తారా? ఇవే ప్రశ్నలు సగటు అమెరికన్లను వెంటాడుతున్నా యి. ఈ విషయంలో అధికార పార్టీ వెనుకబడిందనే చెప్పవచ్చు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్ బారినపడ్డారు.


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కష్టాలు మొదలయ్యాయి. మరోసారి అధికారంలోకి వస్తానని భావిస్తున్న ఆయన ఆశలు క్రమంగా గండిపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు శరీరం కూడా సహకరించలేదు. అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బారినపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్‌వేగాస్‌లో ప్రచారంలో ఉన్నారు. హెల్త్ పరంగా ఇబ్బందులుపడడంతో వెంటనే పరీక్షలు చేయించారు. దీంతో కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది.

ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడు తున్నారని పేర్కొంది. ప్రస్తుతం డెలావేర్‌లోని తన ఇంట్లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు అందులోని సారాంశం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పుకొచ్చింది.


ఎలాగలేదన్నా ఎన్నికల ప్రచారానికి పక్షం రోజులపాటు అధ్యక్షుడు జో బైడెన్ విశ్రాంతి ఇవ్వనున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ దూసుకుపోతున్నారు. మీడియా సర్వేల్లో మెజార్టీ ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదు. గాయం తగిలినచోట బ్యాండేజ్ వేసుకుని ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ALSO READ: అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్? ప్రెసిడెంట్ బైడెన్ హింట్!

ఈ పరిస్థితుల్లో ఏం చేద్దామని డెమోక్రటిక్‌ పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థిని మార్చి దేశవ్యాప్తంగా తిరగడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజార్టీ నేతలు చెబుతున్నమాట.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×