Big Stories

Horoscope: ఈ రోజు రాశి ఫలాలు..వీరికి ముట్టిందల్లా బంగారమే!

Astrology today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం..12 రాశుల్లో ఎవరికి ఆర్థికంగా అనుకూలం? సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? ధనప్రాప్తి ఎవరికి వరిస్తుంది? వంటి విషయాలపై జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

మేషం:
ఈ రాశి వారికి అనుకూలం. వృతి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనులు సక్సెస్ అవుతాయి. అందరితో కలిసి పని పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. డబ్బు వరిస్తుంది. పొదుపు చేయడం ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా చూసుకోవాలి. శని శ్లోకం చదవాలి.

- Advertisement -

వృషభం:
ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.సవాళ్లను స్వీకరించి విజయం పొందుతారు. ఊహించని ఖర్చులు చేసే అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శత్రువుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. లలితాదేవిని పూజించాలి.

మిథునం:
ఈ రాశి వారికి అనుకూల సమయం. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతోంది. ఇబ్బందులు దరిచేరవు. ఉన్నతంగా ఆలోచనలతో సాధించే వరకు వదిలిపెట్టరు. మీ కుటుంబ జీవితం అద్భుతంగా మలుపు తిరుగుతుంది. లక్ష్మీ గణపతి ఆరాధన సహకరిస్తుంది.

కర్కాటకం:
పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ లక్ష్యంపై ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్తలు అవసరం. కీలక నిర్ణయాల్లో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ధనయోగం మిశ్రమంగా ఉంది. కావాల్సిన వారు మీతోనే ఉంటారు. లక్ష్మీదేవి ఆరాధన శ్రేష్ఠం.

సింహం:
ఆత్మవిశ్వాసంతో పనులు విజయవంతం. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ముట్టిందల్లా బంగారమే.ఆర్థిక ఇబ్బందులు ఉండవు. తెలివితేటలతో సమస్యలు పరిష్కరిస్తారు. ఖర్చుల విషయంలో ఒకటికిరెండు సార్లు ఆలోచించాలి. ఓం ఐం హ్రీం కామాక్షే నమ: నామాన్ని జపించాలి.

కన్య:
కోపాన్ని అధిగమించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారా రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇతరులను నమ్మే విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా లాభం పొందుతారు. ప్రేమ విషయంలొ చిరునవ్వుతో ప్రారంభించాలి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సూర్య నమస్కారం చేయాలి.

తుల:
ఈ రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.జాగ్రత్తగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇతరులతో సంతోషంగా ఉంటారు.ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతారు. ధనలాభ సూచితం. వినాయకుడిని సందర్శించుకోవాలి.

వృశ్చికం:
అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది. చేసే పనిలో అంతా అనుకూలంగా కనిపిస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ రంగాల్లో అభివృద్ధి సాధించాలనే తపనతో ముందుకు వెళ్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈశ్వరుడి ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు:
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనతో కీలక సమస్యలు సైతం పరిష్కరిస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు ఉంటాయి. శివపార్వతుల సందర్శనం చేయాలి.

మకరం:
ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు. చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ముందుకు వెళ్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామి అపరిమితమైన ప్రేమ పారవశ్యంతో ఆశ్చర్యపరుస్తారు. గురు ధ్యాన శ్లోకం చదవాలి.

కుంభం:
ఈ రాశి వారికి అనుకూలం. స్థిరంగా ఆలోచించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మెరుగైన ఫలితాలు వరిస్తాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాధ్యానం శ్రేయదాయకం.

మీనం:
ఉద్యోగస్తులకు అనుకూలం. శారీరంగా దృఢంగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఇతరుల సహకారం కలిసివస్తుంది. ఆర్థికపరంగా లాభం పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. షిర్డీసాయిబాబను దర్శించుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News