BigTV English

White House: ఆ అనుమానాల వేళ వైట్‌హౌస్ ఆగ్రహం.. రిపబ్లికన్ల పనేనంటూ..

White House: ఆ అనుమానాల వేళ వైట్‌హౌస్ ఆగ్రహం.. రిపబ్లికన్ల పనేనంటూ..

White House Condemns: గత కొద్దిరోజుల నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యంపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఆయన ఆరోగ్యం విషయమై అనుమానాలు వ్యక్తమయ్యే రీతిలో పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వీటిపై తాజాగా వైట్ హౌస్ స్పందించింది. ఇటు విపక్ష రిపబ్లికన్ పార్టీ నేతల వైఖరిని విమర్శించింది.


‘రిపబ్లికన్ పార్టీ నేతలు ఎంత నిరాశలో ఉన్నారో కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు దృశ్యాలను వక్రీకరించి వాటిని వైరల్ చేస్తున్నారు. అవి ఫేక్ వీడియోలు’ అంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ విమర్శించారు. అయితే, ఇటీవల జరిగినటువంటి జీ7 సదస్సుకు జోబైడెన్ హాజరయ్యారు. మిగిలిన ప్రపంచనేతలంతా ఒకవైపు ఉంటే.. జోబైడెన్ మాత్రం మరోవైపు తిరిగి ముందుకు వెళ్లడమేకాకుండా ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. అయితే, ఆ వీడియోలో అటువైపుగా ఎవరూ లేరు. ఇంతలోనే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనను మిగతా నేతలంతా ఉన్న దగ్గరికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి ప్రెస్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఇతరులతో మాట్లాడేందుకు జోబైడెన్ అటువైపుగా వెళ్లారని చెప్పారు. కన్జర్వేటివ్ మీడియా కూడా దీనిపై నిజనిర్ధారణ చేసిందన్నారు.

Also Read: దేశాధ్యక్షుడి భద్రతా సిబ్బందిని బెదిరించి దోచుకున్న దొంగలు


అలాగే ఇటీవల వైట్ హౌస్ లో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమంలో మరో విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ కార్యక్రమంలో బైడెన్ ఎలాంటి చలనం లేకుండా అలాగే నిల్చుండిపోయారు. ఈ వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది. దీనిపైన కూడా వైట్ హౌస్ ప్రకటన చేసింది. ‘ఆయన అక్కడ నిల్చొని మ్యూజిక్ వింటున్నారు. డ్యాన్స్ చేయలేదు. డ్యాన్స్ తెలియకపోవడం కూడా ఒక ఆరోగ్య సమస్య అని తెలియదు’ అంటూ వైట్ హౌస్ సమర్థించింది. ఇటీవల లాస్ ఏంజిల్స్ లో డెమోక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. దీంట్లో బైడెన్, ఒబామా కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తమ మద్దతురాలకు అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజి దిగి వెళ్లేందుకు సిద్ధంకాగా, బైడెన్ మాత్రం ఎటూ పాలుపోనట్లు ఓ 10 సెకన్ల పాటు ఉన్నచోటే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు. ఈ పరిస్థితి అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్ ను చేయి పట్టి తీసుకెళ్లారు. ఇలా వరసుగా జోబైడెన్ ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడం అధికార డెమోక్రాట్లకు ఇబ్బందిగా మారింది. అయితే, 81 ఏళ్ల వయసులో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఇటీవల బైడెన్ సతీమణి వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags

Related News

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Big Stories

×