BigTV English

Yamatirtha:- యమతీర్థానికి ఆపేరు ఎలా వచ్చింది.

Yamatirtha:- యమతీర్థానికి ఆపేరు ఎలా వచ్చింది.

Yamatirtha:- దేశంలో మిస్టరీగా మారిన ఆలయాల్లో ఐరావతేశ్వర దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో ఉన్న మెట్లు ముట్టుకుంటే ఏడు రకాల శబ్దాలని చేస్తాయి. కుంభకోణానికి 12 కిలోమీటర్ల దూరంలో దరసురం వద్ద ఐరావతేశ్వర దేవాలయం ఉంది. యునెస్కో 2004 లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇంద్రుని యొక్క వాహనం ఐరావతం ఇక్కడున్న శివుణ్ణి సేవించడం చేత స్వామి వారిని ఐరావతీశ్వర అని పిలుస్తారు. ఐరావతం పేరుమీదనే ఐరావతేశ్వర దేవాలయం అని పేరువచ్చింది. ఈ దేవాలయం ప్రధాన గోపురం ఎత్తు 80 అడుగులు. పురాణాల ప్రకారం ఐరావతం దాని వాస్తవ రంగు తెలుపును దుర్వాస మహాముని శాపం వల్ల కోల్పోయి ఈ దేవాలయం లో శివుని అర్చించి అచట గల కోనేరులో స్నానమాచరించినపుడు దాని పూర్వపు రంగును పొందినది అని స్థలపూరణం.


యమధర్మరాజు ఒక మహర్షి శాపంతో తన శరీరమంతా మంటలతో మండుతున్నట్లు అనిపించి ఆ బాధను పోగొట్టుకొనడానికి ఈ దేవాలయంలో అర్చించినట్లు తెలుస్తుంది. యముడు ఈ దేవాలయ కోనేరులో స్నానమాచరించి శరీర మంటలను పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. అందుకే ఈ సరస్సును “యమ తీర్థం” అని పిలుస్తారు. ఈ ఆలయాలు 11 వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. ఇక్కడ ఉన్న ఈ రెండు ఆలయాలు కూడా గొప్ప శిల్పకళా సంపదతో నిర్మించారు. ఈ రెండు ఆలయాలు ఒకటి స్వామివారిది, ఒకటి అమ్మవారిది. ఈ ఆలయంలో స్వామివారి పేరు రాజరాజేశ్వరుడు, అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి.

ఆలయ ద్వారం వద్ద రాయితో చేసిన మెట్లు ఉన్నాయి. వాటిని తాకితే ఏడూ రకాల శబ్దాలను చేస్తాయి. అంటే సప్తస్వరాలు వినిపిస్తాయి. ఇలా రాయిని తాకితే సంగీతం ఎలా వినిపిస్తుంది, దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటనేది మాత్రం ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు. ఆలయ గోడమీద ఎక్కడ ఖాళీ అనేది లేకుండా చక్కని శిల్పాలు చెక్కబడినవి. ఈ గోడల గూళ్ళలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి.


Follow this link for more updates:- Bigtv

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×