Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తీసుకొని ఓ బస్సు మూడో టర్మినల్ ఎయిర్ ఇండియా విమానం దగ్గరకు చేరుకుంది. ఈ క్రమంలో బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్టు సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. బస్సులో ఏసీ షార్ట్ సర్క్యూట్ ప్రాధమిక కారణంగా ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.