BigTV English
Advertisement

Xiaomi 15T Pro: షావోమి 15టి ప్రో వచ్చేసింది.. ఒక్కసారి ఆన్ చేస్తే ఫ్లాగ్‌షిప్‌లు ఫ్రీజ్ అయ్యే స్థాయిలో..

Xiaomi 15T Pro: షావోమి 15టి ప్రో వచ్చేసింది.. ఒక్కసారి ఆన్ చేస్తే ఫ్లాగ్‌షిప్‌లు ఫ్రీజ్ అయ్యే స్థాయిలో..

Xiaomi 15T Pro: షావోమి మళ్లీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. తాజా మోడల్ షావోమి 15టి ప్రో. వేగం, అందం, స్మార్ట్ ఇన్నోవేషన్ అన్నీ కలిసిన ఈ ఫోన్‌ ఒక్కసారి చూసిన వెంటనే మనసును దోచేస్తుంది. షావోమి ఎప్పుడూ టెక్నాలజీలో కొత్తదనం తీసుకువస్తూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం అంచనాలను మించి పోయింది. పనితనం, డిజైన్, కెమెరా, బ్యాటరీ అన్నింటిలోను సమతుల్యంగా రూపొందించిన మోడల్ ఇది.


అమోలెడ్ ఎల్‌టిపిఓ డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వస్తే షావోమి ఈసారి నిజంగా కలల స్క్రీన్ ఇచ్చింది. 6.73 అంగుళాల అమోలెడ్ ఎల్‌టిపిఓ డిస్‌ప్లే ఇందులో వాడారు. దీని రిఫ్రెష్ రేట్ 144Hz వరకు ఉంటుంది. అంటే, యూజర్‌ స్క్రోల్ చేసినా, వీడియోలు చూశినా, గేమ్స్ ఆడినా స్క్రీన్ బటర్ లా స్మూత్‌గా కదులుతుంది. పీక్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్ వరకూ ఉండటం వల్ల ఎండలోనూ స్క్రీన్ క్లారిటీ తగ్గదు. డాల్బీ విజన్మరియు హెచ్‌డిఆర్10 ప్లస్ సపోర్ట్ వల్ల సినిమాటిక్ ఫీలింగ్ వస్తుంది.


50ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్

కెమెరా సెక్షన్‌లో షావోమి మరోసారి తన స్థాయిని చాటుకుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)సదుపాయం ఉంది. కదలికలున్నా ఫోటోలు కచ్చితంగా, క్లారిటీగా వస్తాయి. దీనికి తోడు 50ఎంపి అల్ట్రా వైడ్ లెన్స్, 50ఎంపి టెలిఫోటో లెన్స్ కలిపి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. వీడియోలు 8K రిజల్యూషన్‌లో కూడా రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 32ఎంపి, ఇది ఏఐ బ్యూటిఫికేషన్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోటోలు తీసినప్పుడు లేదా వీడియోలు చేసినప్పుడు లైటింగ్ ఆటోమేటిక్‌గా సర్దుబాటు అయ్యే ఫీచర్ కూడా ఇందులో ఉంది.

5000mAh బ్యాటరీ

పర్‌ఫార్మెన్స్‌కి సరిపోయే బ్యాటరీ సామర్థ్యం కూడా షావోమి పెంచింది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. కానీ అసలైన హైలైట్ దాని చార్జింగ్ టెక్నాలజీ. 120W హైపర్‌ఛార్జ్ సపోర్ట్ ఉన్నందున కేవలం 18 నిమిషాల్లోనే ఫోన్ 100శాతం చార్జ్ అవుతుంది. అలాగే 50W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే వైర్ లేకుండా వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.

Also Read: Ayyappa Swamy Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం.. ఇంట్లోనే అరవణ పాయసం ఇలా తయారు చేయండి

లగ్జరీ ఫోన్‌ – మెటల్ ఫ్రేమ్‌

డిజైన్ పరంగా చూస్తే షావోమి 15టి ప్రో ఒక లగ్జరీ ఫోన్‌లా కనిపిస్తుంది. బ్యాక్ ప్యానెల్ గ్లాస్ ఫినిష్‌తో మెటల్ ఫ్రేమ్‌లో ఉంటుంది. హ్యాండ్‌లో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ వస్తుంది. కర్వ్ డిస్‌ప్లే సైడ్‌లు స్క్రీన్‌ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి. కలర్ ఆప్షన్లు టైటానియం సిల్వర్, మిస్టిక్ బ్లాక్, పెర్ల్ బ్లూ.

హైపర్‌ఓఎస్ సాఫ్ట్‌వేర్ 

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, షావోమి 15టి ప్రోలో తాజా హైపర్‌ఓఎస్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపుదిద్దుకుంది. కొత్త స్మార్ట్ ఫీచర్లతో ఇది పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేస్తుంది. ఏఐ స్మార్ట్ ఫోటోలు, వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్, సీన్ ఆప్టిమైజేషన్, స్మార్ట్ కాల్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ మీ వాడుక అలవాట్లను నేర్చుకుని పనితనాన్ని, బ్యాటరీ వినియోగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.

యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్

స్టోరేజ్ వేరియంట్లు కూడా విభిన్నంగా ఉన్నాయి 12జిజి ప్లస్ 256జిబి, 16జిబి ప్లస్ 512జిబి, 16జిబి ప్లస్ 1టిపి. యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ టెక్నాలజీతో ఫైల్ ట్రాన్స్‌ఫర్ స్పీడ్ రెట్టింపు అయ్యింది.

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌

షావోమి 15టి ప్రోలో ఉన్న ప్రధాన ఆకర్షణ దాని ప్రాసెసర్‌నే చెప్పాలి. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌ను వాడారు. ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్లలో ఒకటి. నాలుగు నానోమీటర్ల టెక్నాలజీతో తయారైన ఈ చిప్‌తో గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌, వీడియో ఎడిటింగ్‌ వంటి హెవీ పనులు సైతం సులభంగా నడుస్తాయి. ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 750 జిపియూ ఉండటంతో గ్రాఫిక్స్ ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంటుంది. గేమింగ్ సమయంలో లాగ్ లేకుండా ఫ్రేమ్ రేట్‌ స్మూత్‌గా కొనసాగుతుంది.

భారత్‌లో ఎప్పుడు ఎంట్రీ- ధర ఎంత

ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో విడుదలైంది. భారతీయ మార్కెట్‌లో నవంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఉంది. అంచనా ధర రూ.59,999 నుంచి రూ.69,999 మధ్యలో ఉండొచ్చు. ఆఫర్లపై ఆధారపడి ధర మారవచ్చు. ఈ ఫోన్ 2025లో టాప్ ఫ్లాగ్‌షిప్‌ల జాబితాలో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించబోతుందని చెప్పొచ్చు.

Related News

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Smart Watch At Rs 999: రూ.15వేల స్మార్ట్ వాచ్ ఇప్పుడు కేవలం రూ.999కే.. అమెజాన్‌లో మళ్లీ షాక్ ఆఫర్

AI Minister Diella: గర్భం దాల్చిన మంత్రి.. ఒకే కాన్పులో 83 మంది పిల్లలు!

iQOO 15 Smartphone: నవంబర్‌లో భారత మార్కెట్లో అడుగు పెట్టనున్న ఐక్యూ 15.. డేట్ ఎప్పుడంటే?

Toyota Hiace Caesar: టయోటా హియేస్ లగ్జరీ ఎడిషన్ చూశారా? వాన్ లోనే రాయల్స్ వైభవం

Moto X70 Air: ఐఫోన్ ఎయిర్‌కు పోటీగా మోటోరోలా కొత్త స్లిమ్ ఫోన్.. మోటొ X70 ఎయిర్ లాంచ్

Best Budget Camera Phones: ఫోటోగ్రఫీ ప్రియుల టాప్ చాయిస్‌ ఫోన్లు.. రూ.30,000 కంటే తక్కువ ధరలో ఇవే బెస్ట్

Big Stories

×