BigTV English

Numerology: ఈ తేదీలో జన్మించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ భర్త ధనవంతుడు అయిపోతాడు

Numerology: ఈ తేదీలో జన్మించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ భర్త ధనవంతుడు అయిపోతాడు

సంఖ్యా శాస్త్రానికి ఎంతో విలువ ఉంది. ప్రతి సంఖ్యలో పుట్టిన వారికి ఒక ప్రత్యేక లక్షణము, ప్రభావము ఉంటుంది. అలాగే ఆ సంఖ్యకు సంబంధించిన సందేశం కూడా దాగి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అంకెలలో పుట్టిన స్త్రీలు తమ జీవితాల్లోనే కాదు, భర్తల జీవితాల్లో కూడా ఆనందాన్ని, శ్రేయస్సును అందిస్తారు. ఆ స్త్రీలు భర్తల పాలిట లక్ష్మీదేవిలా మారతారు. ఆ ఇంట్లో సంపద నిల్వ ఉంటుంది. భర్తకు కుబేరుడిలా కలిసి వస్తూనే ఉంటుంది. ఏ అంకెలో జన్మించిన మహిళలు భర్తల పట్ల అదృష్ట దేవతలుగా మారుతారో తెలుసుకోండి.


ఈ తేదీలలో జన్మించిన వారికి
న్యూమరాలజీ ప్రకారం మూడవ సంఖ్య కలిగిన స్త్రీలు భర్తలకు అదృష్టాన్ని తెరిచి పెడతారు. మూడవ సంఖ్య అంటే ప్రతి నెలలో 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన మహిళల మూల సంఖ్య 3 అవుతుంది. అలా మూల సంఖ్య 3 కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్తలకు అన్ని రకాలుగా కలిసివస్తుంది. విజయం, ఆర్థిక పురోగతి, సానుకూల శక్తి కలుగుతాయి.

మూల సంఖ్య మూడు కలిగిన స్త్రీలు పుట్టుకతోనే లక్ష్మీదేవితో సమానం. వారు అన్ని శుభాలను మోసుకొస్తారు. వారు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఆనందం, సంపద, శాంతి నివసిస్తాయి. ఈ మహిళలను లక్ష్మీదేవి అవతారంగానే చెప్పుకోవాలి.


మూడో తేదీన జన్మించిన మహిళలకు అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. వారిలో పాజిటివిటీ కూడా ఎక్కువ. వారు ఉన్న ఇంట్లోని వాతావరణం శక్తివంతంగా మారుతుంది. సానుకూలంగా మారుతుంది. ప్రతి కష్ట సమయంలోనూ కూడా వారు తమ భర్తకు మద్దతుగా నిలిచి, ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలుస్తారు.

అలాగే ఈ మహిళలకు నిర్ణయాలు తీసుకోవడంలో మంచి నైపుణ్యం ఉంటుంది. వారు ఇచ్చే సలహా భర్తకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భర్త కెరీర్ లేదా వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉండే సలహాలను ఇవ్వగల సత్తా ఈ మహిళలకు ఉంటుంది.

మూల సంఖ్య 3 కలిగిన స్త్రీలు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు ఏమాత్రం దుబారా చేయరు. పొదుపుని చేయడానికి ఇష్టపడతారు. ఆ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. సంపద పెరుగుతూనే ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా కొత్తగా తెరుచుకుంటూనే ఉంటాయి.

ఈ మహిళలు తమ అనుబంధాలు పట్ల పూర్తి విధేయత, ప్రేమతో ఉంటారు. భర్తకు మానసిక ప్రశాంతతను ఇస్తారు. భర్త కుంగిపోయినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తారు. అతని జీవితంలోని ప్రతి మలుపులో విజయాలు వచ్చేలా చేస్తారు.

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×