Big Stories

Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రుల చివరి రోజున ఇలా చేస్తే.. ఆ కోరికలు అన్నీ నెరవేరుతాయ్?

Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9న ప్రారంభమై ఏప్రిల్ 17న దుర్గా నవమితో ముగుస్తాయి. ఈ పండుగ కోసం దుర్గాదేవి భక్తులు ఏడాది పొడవునా వేచి ఉంటారు. నవరాత్రులలో ప్రజలు 9 రోజులు ఉపవాసం ఉంటూ.. దుర్గా దేవిని పూజిస్తారు. నవరాత్రుల్లో నవమి తేదీ చాలా ముఖ్యమైనది. నవమి సందర్భంగా.. కొన్ని కొన్ని పనులు చేయడం ద్వారా అధిక ధన లాభం పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడం కోసం.. ఏం చేయాలంటే?
మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడి, ఎంత డబ్బులు సంపాదించినా సరే మీ వద్ద నిలవకపోతే.. ఈ పనులు చేయవచ్చు. నవమి రోజున దుర్గాదేవికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో శ్రీ సూక్తం పఠించాలి. అంతే కాకుండా శంఖంపూజలు, గోవులను పూజించడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందవచ్చు.

- Advertisement -

ఇలా చేస్తే.. వ్యాధులన్నీ మాయం..!
మీ కుటుంబంలో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, ఔషధం కూడా స్పందించకపోతే, మీరు ఈ చర్యలు తీసుకోవచ్చు. నవమి రోజున ఇంటి ఆగ్నేయ దిశలో నెయ్యి దీపం వెలిగించి దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి. దీనితో ఆ దేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దీంతో మీరు ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉంటారు.

కోరికలు నెరవేరాలంటే..
దుర్గా నవమి సందర్భంగా దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే దుర్గాసప్తశతిని భక్తితో పఠిస్తారో వారి కోరికలు నెరవేరి మానసిక ప్రశాంతత నెలకొంటుంది.

వైవాహిక జీవితంలో సమస్యలు తొలగాలంటే..
మీరు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు నవమి రోజున వివాహిత స్త్రీలకు అలంకరణ వస్తువులను అందించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో మధురానుభూతి లభిస్తుందని, కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News