E-Paper
Advertisement

Saturday:పిండిదీపంతో శనివారం నాడు పూజిస్తే…

Saturday:పిండిదీపంతో శనివారం నాడు పూజిస్తే…
Advertisement

Saturday:హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది. ఏదైనా శుభకార్యం చేసినా పూజ చేసిన దీపం వెలిగించడం మన ఆచారం. అదేవిధంగా దీపాలలో చాలా రకాలు ఉంటాయి.శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.శనివారం ఉదయాన్నే స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో వేంకటేశుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫొటోను ఉంచి సాక్షాత్తు ఆ శ్రీహరిగా భావించాలి.

దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివారి పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటిముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి.స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలను సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగలి,పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఏడు వారాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు.ఇలా ఏడు వారాలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

పిండిదీపంతో పూజ చేసిన తర్వాత దేవుడికి కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూట భోజనం ఆచరించాలి. సాయంత్రం దీపారాధన, స్వామి నామాలను పారాయణం చేయాలి. ఆరోగ్యం సహకరించినవారు నేలపై చాప వేసుకుని నిద్రించాలి. శనివారం మాంసహారం, మద్యంలకు దూరంగా ఉండాలి

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×