Bathroom Vastu Dosh Remedies: వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి భాగానికి నియమాలు ఉంటాయి. ఈ నియమాలను పాటించకపోతే చాలా నష్టం జరుగుతుంది. కష్టపడి పని చేసినా కెరీర్‌లో విజయం సాధించకపోవడం, ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం, పురోగతి సాధించకపోవడం కూడా వాస్తు దోషం లక్షణాలు అని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే ఇంట్లో ఉండే ప్రతీ చోటుకు వాస్తు ఉంటుంది. అందులో భాగంగా బాత్రూమ్‌లో ఉండే కొన్ని వస్తువుల కారణంగా కూడా వాస్తు దోషాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాత్రూంలో ఉండే వస్తువులు ఇంట్లోని వ్యక్తుల పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. ఆర్థిక, శారీరక మరియు మానసిక సమస్యలను కలిగిస్తాయి.
* బాత్‌రూమ్‌ను ఎప్పుడూ దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో నిర్మించకూడదు. ఇలా నిర్మించడం వల్ల బాత్రూమ్ ఇంట్లోని ప్రతికూల శక్తిని పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూమ్ ఇంటికి ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉండాలి.
* బాత్రూమ్‌లో పసుపు లేదా నారింజ రంగును ఉంచవద్దు. వాస్తు ప్రకారం, బాత్రూంలో బ్లూ పెయింట్ లేదా టైల్స్ అమర్చడం శుభప్రదంగా పరిగణిస్తారు. బకెట్ మరియు మగ్ యొక్క రంగు నీలం రంగులో ఉన్నవి వాడితే మంచిది.
* బాత్రూమ్ బకెట్‌ను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. ఎప్పుడూ నీటిని నింపి ఉంచాలి. లేకపోతే ఇంట్లో డబ్బు ఉండదు.
* బాత్రూమ్‌లో ట్యాప్ లేదా బేసిన్ నుండి నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. ఇది ఆర్థిక నష్టానికి ప్రధాన కారణం అవుతుంది. అలాంటి ఇళ్లలోని వ్యక్తులు ఎంత కష్టపడినా ఆర్థిక సంక్షోభానికి గురవుతూనే ఉంటారు.
* బాత్రూంలో తలుపు ముందు అద్దం అమర్చవద్దు. ఇది ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. బాత్‌రూమ్‌లోని అద్దం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. వృత్తాకార లేదా ఓవల్ అద్దాలను ఉపయోగించవద్దు.
* బాత్రూమ్ డోర్ మూసి ఉంచాలి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే, పొరపాటున కూడా తలుపు తెరిచి ఉంచవద్దు. ఇది ఆర్థిక సంక్షోభం, కెరీర్ అంతరాయం కలిగిస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)