BigTV English

Viral News: సరదాగా సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి 60 అడుగుల లోయలో పడిపోయిన యువతి

Viral News: సరదాగా సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి 60 అడుగుల లోయలో పడిపోయిన యువతి

Viral Video: వర్షాకాలం మొదలైందంటే చెట్లు, చేమలు, కొండలు అందంగా మారుతుంటాయి. పర్వతాలు, కొండలపై పచ్చదనం పులకరిస్తుంది. ఈ సమయంలో పర్యాటక ప్రాంతాలు ఎంతో ఆకర్షణీయంగా తయారవుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉండే పర్యాటక ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్, కొండలు, చెరువులు, నదులు నీటితో నిండిపోయి ఉంటాయి. ఈ తరుణంలో చాలా మంది పర్యాటకులు పర్యటనలకు వెళ్తుంటారు. ఈ తరుణంలో అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసేందుకు కూడా సాహసాలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన పని తనను ప్రమాదంలోకి నెట్టేసింది.


మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన బోరాన్ ఘాట్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి పర్యటనకు వెళ్లి సరదాగా సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 అడుగుల లోయలో యువతి పడిపోయింది. వర్షాకాలం కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలని పర్యటనకు వెళ్లిన యువతి ప్రమాదాన్ని కొని తెచ్చుకుందని చెప్పారు. యువతి పూణెకు చెందిన నస్రీన్ అమీర్ ఖురేషీ అని తెలిపారు. బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి లోయలో పడిపోయింది.

వర్షం కారణంగా కాలు జారి 60 అడుగుల లోయలో పడిపోవడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో వారి సహాయంతో యువతి ప్రాణాలతో బయటకు రాగలిగిందని తెలిపారు. చికిత్స నిమిత్తం యువతిని ఆస్పత్రిలో చేర్చినట్లు స్పష్టం చేశారు. అయితే మట్టి జారుడుగా ఉండడంతో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా, ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా వెలుగుచూశాయని పోలీసులు వెల్లడించారు. అందువల్ల పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


Related News

Video viral: ముంబై వరదల్లో హీరోగా మారిన స్పైడర్ మ్యాన్.. నీటిని మొత్తం తోడేశాడుగా.. వీడియో వైరల్

Dance video: చీరలో డ్యాన్స్ దుమ్ముదులిపేసింది భయ్యా.. హీరోయిన్ కూడా పనికిరాదు.. వీడియో వేరే లెవల్

Viral video: ఇవి వరద నీళ్లా.. స్విమ్మింగ్ పూలా..? ఎలా ఈత కొడుతున్నారో చూడండి, వీడియో వైరల్

Viral Video: అగ్నిపర్వతం బద్దలయ్యే క్షణాల ముందు.. ప్రియురాలికి లవ్ ప్రపోజ్, వీడియో వైరల్

Body Double: ట్రంప్‌ను కలిసింది పుతిన్ కాదా.. ఆయన డూపా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే?

UK Schools: ఇంగ్లాండ్‌లోని 30 స్కూళ్లను కొనేసిన చైనా.. డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఇదేనా?

Big Stories

×