EPAPER

Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ శంకర్.. మెంటల్ మాస్ మ్యాడ్ నెస్

Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్  శంకర్.. మెంటల్ మాస్ మ్యాడ్ నెస్

Ram Pothineni: రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్ శంకర్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి- ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో రామ్ మాట్లాడుతూ.. ” ఎప్పుడు మాట్లాడేముందు బ్లాంక్ గా ఉంటాను. ఇంకా మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ట్రైలర్ నచ్చిందనే అనుకుంటున్నాను. 2018 డిసెంబర్ లో పూరి గారిని గోవాలో కలిశాను. నేను స్క్రిప్ట్ రాయడానికి వెళ్తున్నా.. పక్కన ఉంటే ఎనర్జీ ఉంటుంది వచ్చేయ్ అంటే వెళ్లాను. ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. ఒక పదేళ్లు గుర్తుండిపోయే పాత్ర చేద్దామనుకుంటున్నా.. చాలా ఏళ్లు అయిపోయింది అన్నాను. అప్పుడు రాశారు ఆయన ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమాను కరెక్ట్ గా, డీసెంట్ గా చెప్పాలంటే.. ఆడొక మెంటల్ మాస్ మ్యాడ్ నెస్.

అది నా జీవితంలోనే గుర్తింది పోయే పాత్ర. నేను నటించేటప్పుడు నాకు వచ్చిన కిక్ వేరు. ఆ సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడే అన్నాను. ఏవండీ.. ఈ సినిమా చేసినప్పుడు, చూసినప్పుడు నాకు ఎంతైంతే కిక్ వచ్చిందో.. అందులో 10 శాతం ప్రేక్షకులకు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పాను. అప్పుడు అడిగినప్పుడు ఆ క్యారెక్టర్ రాశారు. ఇప్పుడు ఒక్కటే అడిగాను ఆ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్ కు ఒక కిక్కాస్ స్క్రిప్ట్ ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ రాశారు.


నాకు తెలిసి.. ఇప్పటివరకు ఆయన చాలా టైమ్ తీసుకొని చేసిన సినిమా ఇది. చాల కష్టపడ్డారు. ఆయనతో పనిచేసినప్పుడు ఎంత కిక్ ఉంటుందో .. ఆయన స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ ఉంటుంది. ఇక పూరి గురించి చెప్పాలంటే.. కమర్షియల్ సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఒక కమర్షియల్ సినిమా తీయడం అంత ఈజీ కాదు. దానికి ఉన్న సక్సెస్ రేటు చాలా తక్కువ. కానీ, ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే.. దానికి వచ్చే కిక్ ఇంకా దేంట్లో కూడా రాదు.

కమర్షియల్ సినిమాలకు థియేటర్ లో చేసే సెలబ్రేషన్స్ వేరు. అది ఇస్మార్ట్ శంకర్ కు చూసా.. మళ్లీ ఇప్పుడు ఆ రచ్చ చూడాలని అనుకుంటున్నాను. ఇక ప్రతి పూరి గారి సినిమాలో ఆలీగారికు ఒక స్పెషల్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇందులో కూడా అలాగే ఉంటుంది. నేను ఆయనతో నటించలేదు కానీ, సెట్ లో అందరూ చాలా నవ్వుకున్నారని చెప్పారు.

ఇక హీరోయిన్ కావ్య చాలా బాగా చేసింది. ఆమె ఎంతో మంచిది. సెట్ లో అందరిని పంచదార అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే.. అక్కడ ఉన్న చీమలకు వేయడానికి. చీమలనే అంత ప్రేమగా చూసుకుంటే.. కాబోయే వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటుందో. సినిమాలో పనిచేసినవారందరూ బాగా కష్టపడ్డారు. ఆగస్టు 15 న అందరూ థియేటర్ లో ఈ సినిమా చూడండి” అని ముగించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×