BigTV English

Vastu Tips: ఫ్లాటు కొనేముందు చూడాల్సిన అంశాలివే..!

Vastu Tips: ఫ్లాటు కొనేముందు చూడాల్సిన అంశాలివే..!

Things To Consider Before Buying A Flat:


Things To Consider Before Buying A Flat: మీరు ఏదైనా స్థలం కొనాలనుకుంటున్నారా? అందులో ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన కూడా ఉందా? అయితే.. స్థలం కొనేముందు కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైనా వెంచర్‌లో ఒకసారి స్థలం కొన్న తర్వాత దానిని మార్చుకోవటం కష్టం గనుక ముందే ఈ క్రింది అంశాల మీద దృష్టి పెట్టాలని వారు సూచిస్తున్నారు.

వెంచర్‌లోకి ప్రవేశించేటప్పుడు ప్రధాన మార్గాన్ని గమనించాలి. వెంచర్‌‌లోకి వెళ్లే ప్రధాన మార్గం వెంచర్‌కి తూర్పు, ఈశాన్యం, ఉత్తరం వైపు ఉంటే వాస్తు పరంగా అది మంచి ఛాయిస్. లేవుట్‌కి దక్షిణం లేదా పశ్చిమ భాగంలో చెరువులు, పాడుబడిన నిర్మాణాలు, స్శశానం లేకుండా చూసుకోవాలి. అలా ఉంటే.. అక్కడ నివాసముండే కుటుంబాల్లో కలహాలు, డబ్బు ఇబ్బందులు, న్యాయ వివాదాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. లేవుట్‌కి దక్షిణం లేదా పడమర దిక్కున కొండ లేదా గుట్ట ఉంటే అలాంటి ప్రదేశం ఇల్లు నిర్మించుకోవటానికి బాగా అనుకూలమైనదని గుర్తించాలి.


Read more: పిల్లలతో మీరు నిద్రిస్తున్నారా.. మీకో హెచ్చరిక..!

వేసిన లేఅవుట్ ఎత్తు పల్లాలు లేకుండా చదునుగా ఉండేలా చూసుకోండి. దక్షిణం వైపు ఎత్తుగా ఉండి ఉత్తర దిక్కుకు వచ్చే సరికి పల్లంగా ఉన్నా, పడమర ఎత్తుగా ఉండి తూర్పున పల్లంగా ఉన్నా అక్కడి ప్లాటు కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఇల్లు కట్టుకుని ఉండేవారికి మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు తలెత్తవు. తూర్పు ప్రవేశ మార్గమున్న వెంచర్‌లో కొనేటప్పుడు ఎడమ వైపు ఉండే ప్లాట్లు ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఉత్తరం వైపు నడక వచ్చేలా ఇల్లు కట్టుకోవచ్చు.

ఉత్తరం వైపు నుంచి వెంచర్‌లోకి ప్రవేశించేటట్లయితే, కుడివైపు వరుసలోని ప్లాట్లను ఎంచుకుంటే తూర్పు ముఖం వచ్చేలా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఒకవేళ ద‌క్షిణ ముఖంగా ఉన్న ప్లాటు మీరు కొని అందులో ఇల్లు కడితే, ఇంటి సింహద్వారం నుంచి నాలుగడుగులైనా తూర్పుకు నడిచి, తర్వాత దక్షిణం వీధిలో అడుగుపెట్టేలా చూసుకోవాలి. దీనికోసం.. మీ ప్లాటులో పడమర వైపు ఎక్కువ స్థలం వదలకుండా, వీలున్నంత మేర ముందే వదులుకోవాలి.

తూర్పు, ఉత్తరం ముఖాలున్న ఇంటిలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మంచి సూర్యరశ్మి పడి, ఇంట్లో వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. మీ ప్లాటుకు తూర్పు, ఉత్తరం వైపు ఉన్న స్థలాల నుంచి వాననీరు వచ్చి చేరేలా ఉండకూడదు. అలాగే.. రెండు పెద్ద పెద్ద ప్లాట్ల మధ్య సన్నగా, పొడవుగా ఉన్న స్థలం కొనటం మంచిది కాదు. దీనివల్ల ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత లోపిస్తుందని వాస్తు చెబుతుంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×