E-Paper
Advertisement

Mars Transit 2024: జూన్ 1 నుంచి మేష రాశిలో కుజుడు.. 41 రోజులు ఈ రాశుల వారికి భలే అదృష్టం!

Mars Transit 2024: జూన్ 1 నుంచి మేష రాశిలో కుజుడు.. 41 రోజులు ఈ రాశుల వారికి భలే అదృష్టం!

Mars Transit 2024: కుజుడు త్వరలో తన రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు. కుజుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. అంగారకుడి ప్రభావంతో వారు సంపన్నులు కాబోతున్నారు. అంగారకుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. మీనరాశిలో ఉన్న కుజుడు మరికొద్ది రోజుల్లో మేషరాశిలో ప్రవేశం చేస్తాడు.

అంగారకుడు మేష రాశికి అధిపతి. అయితే అటువంటి పరిస్థితిలో కుజుడి సంచారం కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది. జూన్ 1 నుంచి మేష రాశిలో కుజుడు ప్రవేశించనున్నాడు. జూలై 12 వరకు కుజుడు మేషరాశిలో ఉంటాడు. మేషం, వృశ్చిక రాశులకు కుజుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కుజ సంచారం కారణంగా 41 రోజుల్లో కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం .

మేషరాశి:
మేష రాశిలో కుజుడు సంచరించడం వల్ల ఈ రాశివారికి అదృష్టం కలసివస్తుంది. పాత పెట్టుబడులతో మంచి లాభాలు కలుగుతాయి. వృత్తి పనిలో కూడా ప్రశంసలు అందుకుంటారు. వారి శక్తి సామర్థ్యాల కారణంగా గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. ప్రయాణాల వల్ల కూడా లాభాలు పొందే అవకాశముంది. మీరు చేసిన పనికి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయం.

Also Read: Mangal Gochar 2024: జూన్ 1 నుండి చాలా శక్తివంతమైన రాజయోగం.. రాత్రికి రాత్రే ఈ రాశుల వారు ధనవంతులు అవుతారు

సింహరాశి:
ఆదాయం పెరగడం వల్ల సింహరాశి వారు డబ్బుకు సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో కూడా ఆనందంగా గడుపుతారు. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం చాలా మంచిది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

మిథున రాశి:

ఈ రాశి వారికి కుజుడి సంచారంతో ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అంతే కాకుండా గౌరవం పెరుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలను తీసుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు.

Also Read: Morning Dreams: బ్రహ్మ ముహూర్తంలో కలలో ఇవి కనిపిస్తే ఎంతో అదృష్టం.. ఏకంగా..

కన్యా రాశి:
ఈ సమయంలో కన్యారాశి వారు ఉద్యోగంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. వ్యాపారులకు కూడా లాభాలు అందుతాయి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం శుభదాయకం అని చెప్పవచ్చు.

ధనస్సురాశి:
కుజుడు రాశి మార్పు చెందడం వల్ల ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ధనం వచ్చే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి. వారి పనులకు సంబంధించి విదేశాలకు కూడా వెళ్లాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది.

Also Read: 135 రోజుల పాటు శనిదేవుడి తిరోగమనం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం..!

మీనరాశి:
కుజుడి సంచారం మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం పాటించాలి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×