BigTV English

Dreams:మురికి నీళ్లు కలలోకి వచ్చిందా సంకేతమిదా…

Dreams:మురికి నీళ్లు కలలోకి వచ్చిందా సంకేతమిదా…

Dreams:మన నిద్రపోయేటప్పుడు స్వప్నాలు రావడం సహజం. కొన్ని మనం గుర్తుంచుకునే కలలు ఉంటాయి. మరికొన్నింటిని అప్పటికప్పుడే మరిచిపోతుంటాం. కలలో నీళ్లు కనిపిస్తే కొన్ని శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. నదులను, సముద్రాలను దాటినట్లు కల వస్తే శుభ ఫలితాల సంకేతంగా భావించాలట. సముద్రపు ఒడ్డు అలల మధ్యన ఉన్నట్లు కనిపిస్తే కష్టాలు కలుగుతాయి. నదులు, సముద్రాలు, చెరువులు కనిపిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.


వర్షాలు కురిసినట్లు, వరదలా వచ్చినట్లు కలలు వస్తే అనారోగ్యం కలుగుతుంది. అయితే వరదలు తగ్గినట్లు కలగాలంటే కష్టాలు తీరుతాయి. నుయ్యి లేదా బావిలో నుండి నీరు పొంగి పొర్లుతున్నట్లు కలలు వస్తే ధనం నష్టం సంభవించబోతున్నట్టు లెక్క. అయినవారిలో ఎవరైనా మరణించడం వంటి అశుభ కార్యాలు జరుగుతాయి.

మురికినీరు కలలో కనబడితే అనుకున్న పనులు నెరవేరవు. ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. బ్రాహ్మణుడు కలలో కనిపిస్తే యజ్ఞము చేస్తారు. డబ్బు, ఆరోగ్యము కలుగుతుంది. అదేవిధంగా నీటిలో తిరగడం వల్ల కాళ్ళకు పాచి పట్టినట్లు కలగంటే ధనము లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.


ఇలాంటి కలలు మహిళలకు వస్తే ఆ ఫలితాలు మరోలా ఉంటాయి. నీళ్లు కలలోకి వస్తే స్త్రీకి వస్తే వైధవ్యం లేదా భర్తకి కష్టాలు, ఆపదలు కలుగుతాయి. ఓడ ఎక్కినట్లు కలలు వస్తే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటి నిండా నీరు జిమ్మినట్లు కలగంటే నష్టము కలుగుతుంది. నదిలో తలపైకి ఎత్తి ఈదినట్లు కలగంటే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని జోతిష్య శాస్త్రజ్ఞులు అంటున్నారు.

చల్లటి నీరు తాగుతున్నట్లు కలగంటే సుఖసంతోషాలు చేకూరుతాయి. అదే వేడి నీరు తాగినట్లు కలగంటే భరించలేని కష్టాలు వచ్చి పడతాయి. బావిలోంచి నీరు తోడుతున్నట్లు కల వచ్చిందంటే ఐశ్వర్య, వివాహ ప్రాప్తి కలుగును.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×