BigTV English
Advertisement

Vastu Tips: ఈశాన్యం ఒక్కటే పెరిగితే కలిసి వస్తుందా…

Vastu Tips: ఈశాన్యం ఒక్కటే పెరిగితే కలిసి వస్తుందా…

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఈశాన్యానికి ప్రాధాన్యం ఉంది. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరంతోపాటు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం దిశలను అష్ట దిక్కులు అంటారు. తల పైన ఊర్ధ్వ దిశ, పాదాల కింద అధో దిశను కలిపితే మొత్తం దశ దిక్కులు.దిశలను గుర్తించిన తర్వాత వీధిని గుర్తిస్తాం. స్థలానికి ఒకవైపు లేదా అంతకంటే ఎక్కువ దిక్కులా వీధులు ఉంటాయి. వీధి నిర్ణయం జరిగిన తర్వాత స్థలం దిశల హెచ్చు తగ్గులు , వాటి ఫలితాలను నిర్ణయిస్తుంది శాస్త్రం.


తూర్పు ఆగ్నేయం పెరిగితే సంతాన నష్టం లేదా అల్ప సంతతి కలుగుతుంది. దక్షిణ ఆగ్నేయం పెరిగితే కుటుంబ కలహాలు కలుగుతాయి.మనస్తాపం, అశాంతి, అనారోగ్యం, ఆర్థిక నష్టం కలుగుతాయి. తూర్పు దక్షిణ ఆగ్నేయం పెరిగితే సంతానం కలగడంతోపాటు.. ధనలాభం కలుగుతుంది. చెడు అలవాట్లకు బానిసై రోగాలను కొనితెచ్చుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. నైరుతిలోనూ దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ దక్షిణ నైరుతి అని ఉంటాయి. దక్షిణ నైరుతి పెరిగే రోగబాధలు, ప్రాణ భయం, ఆపదలు తలెత్తుతాయి. పశ్చిమ నైరుతి పెరిగితే చెడు స్నేహం, అలవాట్ల వల్ల ధన నష్టం, దుష్ట కార్యక్రమాల్లో పాల్గొనటం, మూర్ఖంగా వాదించడం లాంటి పర్యావసనాలు తలెత్తుతాయి. పశ్చిమ దక్షిణం పెరగడం వల్ల శత్రు, రుణ బాధలతో నష్టం జరుగుతుంది.

పశ్చిమ వాయువ్యం పెరగడం వల్ల రాజదండన, అవమానం, మనసు అదుపులో లేకపోవటం, అధిక వ్యయం, నష్టాలు జరుగుతాయి. ఉత్తర వాయువ్యం పెరిగితే దారిద్య్రం, సుఖహాని, పరాభవం, శతృత్వం పెంచుకోవడం, నిద్ర కరువు కావడం లాంటి ఫలితాలు తలెత్తుతాయి. ఉత్తర పశ్చిమ వాయువ్యం పెరగడం వల్ల శత్రువులు పెరుగుతారు, సంతోష నాశనం, సంతానంపై కొన్ని కల్మషాలు ఏర్పడుతాయి.


Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×