E-Paper
Advertisement

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిపోయిన బస్సు.. 40 మంది భారతీయులు
Advertisement

Indian bus fall at river in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 40 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో పలువురు గల్లంతు అయినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గాలింపు మొదలుపెట్టారు. ఘటన సమయంలో నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ ఘటన తనహున్ జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు.. పోఖరా నుంచి ఖాట్మండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక సైడ్ అంతా కొండ.. మరోవైపు నది ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదం దాటికి బస్సు పైటాప్ ఎగిరి నదిలో పడింది.

ALSO READ: థాయిలాండ్ లో కుప్పకూలిన విమానం..9 మంది మృతి

Advertisement

యూపీ ఎఫ్‌టీ 7623 నెంబరు గల బస్సు అని నేపాల్‌లోని  తనహ్యూ జిల్లా పోలీసు అధికారి తెలిపారు. బస్సు ప్రమాదం విషయం తెలియగానే యూపీ రిలీఫ్ కమిషనర్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన బస్సులో యూపీకి చెందినవారు ఎవరైనా ఉన్నారా అనేదానిపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

నేపాల్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. భారీ వర్షాలు కొండచరియల కారణంగా రెండు బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు సహా 60 మంది ప్రయాణికులు గల్లంతైన విషయం తెల్సిందే.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×