Constable suicide: మహబూబ్ సాగర్ చెరువు కట్టపై దారుణ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సందీప్ అనే వ్యక్తి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఏడాదిగా సంగారెడ్డి టౌన్ పోలీస్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు సందీప్. స్థానికుల సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లుగా సందీప్ ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిస అయ్యాడు.. దీంతో పలువురు దగ్గర భారీగా అప్పులు చేసి బెట్టింగ్ లో భారీగా డబ్బు లాస్ వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది రివాల్వర్ తో కాల్చకుని మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించి రివాల్వర్ స్వాధీంనం చేసుకున్నారు. ఇంతకీ సందీప్ దగ్గరకు ఈ రివాల్వర్ ఎలా వచ్చిందన్న చర్చ పోలీస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.