E-Paper
Advertisement

Garlands: అమ్మవారికి నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారో తెలుసా..?

Garlands: అమ్మవారికి నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారో తెలుసా..?

Garlands: అమ్మవారికి నిమ్మకాయల మాల ఎందుకు వేస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా..? అసలు నిమ్మకాయల మాల ప్రాముఖ్యత తెలుసుకుందాం. అలాగే ఇంట్లో అమ్మవారికి ( అమ్మవారి ఫోటో లేదా విగ్రహం) నిమ్మకాయల మాల వేస్తే ఎలా వేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిమ్మకాలయ మాల ఎందుకు వేయాలి?:

అమ్మవారి స్వరూపాలైన దుర్గమ్మ, భద్రకాళి, మరియు గ్రామ దేవతలకు నిమ్మకాయల మాల అంటే ఎంతో ఇష్టం. నిమ్మకాయ శక్తికి సంకేతం. మనలో ఉన్న దిష్టి, ప్రతికూల శక్తి (Negative Energy), మరియు దుష్ట ప్రభావాలను పీల్చుకునే శక్తి నిమ్మకాయకు ఉంటుంది. అందుకే అమ్మవారిని శాంతింపజేయడానికి, మనల్ని రక్షించుకోవడానికి ఈ మాల వేస్తారు.

ఎన్ని నిమ్మకాయల మాల వేయాలి?:

సాధారణంగా మీ మొక్కుబడిని బట్టి లేదా సమస్య తీవ్రతను బట్టి 11, 21, 51, లేదా 108 నిమ్మకాయలతో మాల కట్టి సమర్పిస్తారు. 108 నిమ్మకాయల మాల అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందట.

నిమ్మకాయల మాల ఏరోజు వేయాలి:

అమ్మవారికి ఏ రోజు వేసినా మంచిదే అని చెప్తున్నారు పండితులు కానీ వారంలో ఏ రోజు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందనేది కూడా శాస్త్రంలో ఉందంటున్నారు.

శుక్రవారం:  సౌభాగ్యం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం వేయాలని సూచిస్తున్నారు.

మంగళవారం: రాహుకాలం (మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు) సమయంలో దుర్గాదేవికి వేస్తే రాహు దోషాలు పోయి, పెళ్లి సంబంధాల్లో అడ్డంకులు తొలగుతాయట.

ఆదివారం: ఆదివారం అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తే  తీవ్రమైన దిష్టి దోషాలు తొలగిపోతాయట. అలాగే శతృ బాధల  నుంచి విముక్తి లభిస్తుందట.

పూజా విధానం, ఎన్ని రోజులు ఉంచాలి?:

మచ్చలు లేని, పండని (పచ్చగా లేదా పసుపుగా ఉన్న) స్వచ్ఛమైన నిమ్మకాయలను తీసుకోవాలి. ఎర్రటి దారంతో మాలగా కట్టి అమ్మవారి మెడలో వేయాలి. అమ్మవారి విగ్రహానికి వేస్తే అవి వాడిపోయే వరకు (2-3 రోజులు) ఉంచవచ్చు. ఫోటోకి అయితే మరుసటి రోజే తీసేయడం మంచిదట.

తీసిన నిమ్మకాయలను ఏం చేయాలి?:

మాల తీసిన తర్వాత ఆ నిమ్మకాయలు ఎవరి పాదాలకు తగలకుండా చూడాలి. వాటిని ప్రవహించే నీటిలో (కాలువ లేదా నది) కలపాలి. కాలువ లేదా నది అందుబాటులో లేకపోతే.. ఎవరూ తొక్కని చోట, ఏదైనా చెట్టు మొదట్లో వేయాలట.

ఇంట్లో వేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు:

ఇంట్లో వేసేటప్పుడు సాధారణంగా 11 లేదా 21 కాయలతో మాల తయారు చేసి  వేయడం మంచిదట. ఎర్రటి దారంతో మాల కట్టాలి. సూదితో కాయలను గుచ్చవచ్చు, కానీ ఆ సూది కొత్తదై ఉండాలి (వాడిన సూది వాడకూడదు) లేదా అమ్మవారికి సంబందించినవి spare గా వాడాలి. శుక్రవారం ఉదయం లేదా మంగళవారం రాహుకాలంలో వేయడం అత్యంత శుభప్రదమట.

ఇంట్లో ఎన్ని రోజులు ఉంచాలి..ఎప్పుడు తీసివేయాలి?:

ఇంట్లో నిమ్మకాయల మాల ఒక్క రోజు లేదా గరిష్టంగా రెండు రోజులు మాత్రమే ఉంచాలట.  కాయలు నల్లగా మారుతున్నా లేదా వాడిపోతున్నా వెంటనే తీసివేయాలట. ఎందుకంటే అవి ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి. అవి అలాగే ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంట్లోనే ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గుడిలో తీర్థము తీసుకున్నప్పుడు ఈ తప్పులు అసలు చేయకండి – ఇంకా గుడిలో ఎలా ఉండాలంటే 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×