BigTV English

Kuja Dosha Prevention Tips: మంగళవారం ఇలాచేస్తే.. కుజ దోషం పోవాల్సిందే..!

Kuja Dosha Prevention Tips: మంగళవారం ఇలాచేస్తే.. కుజ దోషం పోవాల్సిందే..!
Kuja Dosha

Kuja Dosha Prevention Tips on Tuesday: ఎవరికైనా చాలారోజుల పాటు పెళ్లి కాకపోతుంటే.. కుజ దోషం ఉందేమోనని చాలామంది అనుమానిస్తుంటారు. దీంతో పలువురు జ్యోతిషులను ఆశ్రయిస్తుంటారు. లగ్నంలో కుజుడున్నా, లేదా 2, 3, 5, 7, 8, 9,10, 11 స్థానాల్లో కుజుడున్నా దానిని కుజదోషంగా పరిగణిస్తారు. కుజదోషం వలన జీవిత భాగస్వామి వియోగం కలిగే అవకాశాలుంటాయని పెద్దలు చెబుతుంటారు. మరి ఈ కుజదోషం తొలగి త్వరగా వివాహం కావాలన్నా, ఇతర ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలన్నా కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. అవి..


కుజునికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ, కార్తికేయ హోమం చేయించడంతో బాటు మోపిదేవి, కుక్కే క్షేత్రాల్లో కార్తికేయ ఆరాధన వల్ల ఈ దోషం తొలగిపోతుంది.
ఆవుకు బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు పెట్టటం, మంగళవారం రోజున ఎర్రని కుక్కకు తిండిపెట్టటం శుభఫలితాన్నిస్తుంది.
మహిళలు కుజదోషముంటే.. 7 మంగళ వారాలు, ఏడుగురు ముత్తైదువులకు ఎర్రని పూల , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి. ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.

కోతులకు తీపి పదార్థములు తినిపించాలి. రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది. పోట్లకాయ తరగటం, మంచిది కాదు. రక్త దానము చేయుట చాల మంచిది.


అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్ర రవికల గుడ్డ దానం మంచిది. కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి. రాగి పళ్ళెం లో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.

కుజ గ్రహం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు. కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటే ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.

ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి, దక్షిణ దిశలో మూడు వంతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తయారు చేసిన ఆహారము తీసుకుంటే, భార్య భర్తలు కూడా సంతోషంగా ఉంటారు, సమయానికి డబ్బు అందుతుంది.

కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వస్తే, మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును. ఈ పరిహారములే కాక ప్రత్యేక పరిహారములు కూడా కలవు.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×