Myanmar: మయన్మార్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారు జామున సమయంలో భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదు అయ్యింది. దీని ప్రభావం భారత్‌పై పడింది. ముఖ్యంగా సెవెన్ సిస్టర్ స్టేట్స్‌లోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది.
భారత్ చుట్టూ భూప్రకంపనలు
మయన్మార్‌లో మంగళవారం వేకువజామున భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు వచ్చినట్టు తెలుస్తోంది. మయన్మార్ తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
భూకంపం మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఆగ్నేయంగా కేవలం 27 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్టు గుర్తించారు. భూకంపం 15 కిలోమీటర్లు లోతులో ఏర్పడినట్టు తెలుస్తోంది. మయన్మార్‌లోని భారత సరిహద్దుకు చాలా దగ్గరగా సంభవించింది. ప్రస్తుతానికి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ALSO READ: గాంధీ విగ్రహంపై పిచ్చిరాతలు, లండన్‌లో దారుణం
జరిగిన నష్టం గురించి అంచనాలు వేయడం మొదలుపెట్టాయి. దీంతోపాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలైన అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. మూడురోజుల కిందట అంటే సెప్టెంబర్ 27న శనివారం బంగ్లాదేశ్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
భయంతో ఆ ప్రాంత ప్రజలు
దాదాపు మూడు రోజుల తర్వాత భూకంపం రావడంతో ఇంకా భూప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఘటన తర్వాత స్వల్ప ప్రకంపనలు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి.
ఇదిలావుండగా సోమవారం అర్థరాత్రి అంటే 12.09 గంటలకు మహారాష్ట్రలోని సతారాలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం లోతు 5 కిలోమీటర్ల లోతుగా గుర్తించారు. కొల్హాపూర్‌కు వాయువ్యంగా 91 కి.మీ దూరంలో ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్, భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో భయం మొదలైంది.
మయన్మార్‌లో భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
ఈ రోజు(మంగళవారం) తెల్లవారుజామున సంభవించిన భూకంపం
రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైన భూకంప తీవ్రత
భారత్‌లోని మణిపూర్, నాగాలాండ్, అస్సాంలోనూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం pic.twitter.com/9m3ujKdMgI
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025